చూడబోతే ఎన్నికల కమీషన్ తో గొడవలు పెట్టుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు చంద్రబాబునాయుడు. లేకపోతే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి మరీ సమీక్షలు నిర్వహిస్తారా ? దేశంలోనే అత్యంత సీనియర్ నేతనని చెప్పుకుంటారు. దేశంలోనే తనంతటి సీనియర్ నేత మరొకరు లేరని భుజాలు చరుచుకుంటుంటారు. అలాంటిది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చేయాల్సిందేమిటి ? చేయకూడనిది ఏమిటి ? అనే విషయాలు తెలీకుండానే ఉంటాయా ?

 

తనకు తెలీనీ విషయం లేదన్నది చంద్రబాబు భావన. అంటే ఒకరకంగా తనను తాను గూగుల్ తండ్రిలాంటి వాడినని అనుకుంటుంటారు. అలాంటి చంద్రబాబుపై తాజాగా ఎన్నికల కమీషన్ మండిపడింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి సమీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి. ప్రభుత్వ శాఖాధిపతులను ఎలాంటి సమీక్షలు నిర్వహించకూడదని తెలిసినా చంద్రబాబు సమీక్షలు పెట్టుకున్నారు.

 

పోలవరం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. సిఆర్డిఏ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు సమీక్షలు చేయకూడదు. ఒకవేళ చంద్రబాబు సమీక్షలు నిర్వహించినా ఉన్నతాధికారులు హాజరుకాకూడదు. అయితే చంద్రబాబు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు వీర విధేయులుగా ఉన్న ఉన్నతాధికారులు హాజరవుతునే ఉన్నారు. ఇదే విషయాన్ని కొందరు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళారు.

 

ఎప్పుడైతే కోడ్ ఉల్లంఘన విషయంలో ఎన్నికల కమీషన్ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందో హోంశాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరుకాలేదు. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మాత్రం రోజువారీ వ్యవహారాలపై సమీక్షలు చేస్తు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.  ఫలితాలు వచ్చేంత వరకూ మరి చంద్రబాబు ఏం చేయాలంటే మనవడు దేవాన్ష్ తో రోజు బంతాట ఆడుకుంటే సరిపోతుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: