ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. బుర్రలు వేడెక్కించే ప్రశ్న ఇది. సమాధానం రావడానికి కచ్చితంగా 34 రోజులు పడుతుంది. కానీ ఇన్ని రోజులు టెన్షన్ పడడం అంటే సామాన్య విషయం కాదు. మరీ ముఖ్యంగా పార్టీ వారికి చాలా చాలా కష్టమైన విషయం. అయినా తప్పదు, మధ్యలో వారిని వీరినీ కబురు కనుక్కుంటున్నారు. కొన్ని ఓదార్పు ఇస్తూంటే మరి కొన్ని ఏడుపుని తెప్పిస్తున్నాయి.



టీడీపీ గెలుస్తుందని ఆ లెక్కా ఈ లెక్కా కలిపి అనుకూల మీడియా నానా పాట్లు పడుతోంది. ఎంత చేసినా ఎన్ని కలిపినా వంద మార్కుని దాటించలేకపోతోంది. ఇక తమ్ముళ్లది తలో మాట. అవి కూడా కోటలు దాటేస్తున్నాయి. ఏకంగా 150 సీట్లు అని ఒకరు అంటే ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మరో మంత్రి గారు అంటున్నారు. ఇక ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిన తరువాత ఏదో నంబర్ నోటికి వచ్చింది అనేస్తున్నారు తప్ప గుండెళ్ళో గాబరా మాత్రం అలాగే ఉంటోంది.



మరి ఈ సమయంలో టీడీపీకే గురువుగా ఉంటున్న ఓ మీడియా అచ్చమైన స్వచ్చమైన రిపోర్ట్ ఒకటి చేతిలో పెట్టిందని న్యూస్ వైరల్ అవుతోంది. అందులో ఈసారి అధికారం టీడీపీ నుంచి చేజారడం ఖాయమని తేల్చిచెప్పినట్లుగా భోగట్టా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి జగనే సీఎం అని కూడా తేల్చేసిందని అంటున్నారు. ఇక ఏపీలో ఆశలు వదిలేసుకుని వచ్చిన ఎంపీలతో కేంద్రంలో పాగా వేయడానికి ట్రై చేస్తే బెటర్ కూడా ఓ సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బాగానే ఉంది కానీ అరడజన్ మంది ఎంపీలు మాత్రమే వస్తాయని చెప్పిన ఆ గురు పత్రిక రిపోర్ట్ ఆ సీట్లతో ఏ విధంగా చక్రం తిప్పాలో మాత్రం చెప్పకపోవడం విశేషమే.



మరింత సమాచారం తెలుసుకోండి: