ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాలి! ఎట్టిప‌రిస్థితిలోనూ ఓట‌మిని అంగీక‌రించ‌లేం! అనుకున్న నాయ‌కుడు ఏం చేస్తాడు? ఎలా ముందుకు వెళ్తాడు? గ‌తంలో అంటే బూతుల ఆక్ర‌మ‌ణ‌, రిగ్గింగుల‌కు అవ‌కాశం ఉండేది. అయితే, ఇప్పుడు ఈవీఎంలు రావ‌డం, కొంత‌మేర‌కు ట్రాన్స్‌ప‌రెన్సీ ఉండ‌డంతో ప్ర‌జ‌ల‌ను సెంటిమెంట్‌గా రెచ్చ‌గొట్టేందుకునాయ‌కులు త‌మ త‌మ పంథాల్లో ముందుకు సాగారు. కొంద‌రు కులం కార్డును బ‌య‌ట‌కు తీస్తే.. మ‌రికొంద‌రు మ‌తం కార్డును ఇలా ఓట‌మి ఖాయ‌మ‌ని భావించిన నాయ‌కులు ఒక్కొక్క‌రు ఒక్క‌క్క విధంగా ఎన్నిక‌ల్లో చిందులు తొక్కారు. ఇలా.. టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా త‌న‌దైన పంథాలో సెంటిమెంటును ప్లే చేసేందుకు ప్ర‌య‌త్నించారు. 

Image result for kodela siva prasad

గ‌డిచిన ఐదేళ్లుగా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడెలకు స్థానిక‌ప‌రిస్థితులు కానీ త‌న కుమారుడి ఆగ‌డాలు కానీ తెలియవంటే ఎవ‌రైనా న‌మ్ముతారా? మ‌రీ ముఖ్యంగా విప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌కు చెందిన‌ప‌త్రిక నిత్యం అనేక క‌థ‌నాలు ప్ర‌చురించింది. వీటిని చూసైనా త‌న పుత్ర‌ర‌త్నం పాపాల‌ను అడ్డుకోవాల్సిన బాధ్య‌త త‌న‌కు ఉంద‌ని కోడెల భావించ‌లేదు. ఎక్క‌డిక‌క్క‌డ దందాలు, రౌడీ యిజంతో బెదిరింపులు, వ్యాపారుల నుంచి దోపిడీ, కాంట్రాక్ట‌ర్ల ర‌క్తం పీల్చ‌డం, అభివృద్ధి ప‌నుల నుంచి క‌మీష‌న్లు ఇలా ఒక‌టా రెండా.. అందిన కాడికి దోచుకున్నారు కోడెల వారి కుమారుడు. ఈయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిసార్లు అడిగినా.. అధికారం అడ్డం పెట్టుకుని కోడెల కొట్టేశారు. 

Related image

చివ‌రికి ఈ ప‌రిస్థితి స‌త్తెన‌ప‌ల్లిలో కోడెల‌కు వ్య‌తిరేకంగా అఖిల‌ప‌క్షం ధ‌ర్నా చేసేవ‌ర‌కు పోయింది. దీంతో ప్ర‌జ‌ల‌లో వ్య‌తి రేక‌త కూడా మిన్నంటింది. ఇక‌, ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితి స్ప‌ష్టంగా కోడెల‌కు అర్ధ‌మైంది. దీంతో ఆయ‌న సెంటి మెం టు నాట‌కానికి తెర‌దీశారు. ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్‌లోకి వెళ్లిత‌లుపులు వేసుకుని క‌ళ్లజోడు నేల‌పైకి విసిరి కొట్టి  చొక్కాలు చింపుకొని నాట‌కాన్ని ర‌క్తి కట్టించారు. త‌న‌ను వైసీపీ నాయ‌కులు కొట్టార‌ని, స్పీక‌ర్ గా త‌న‌కే ర‌క్ష‌ణ‌లేక పోతే.. రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని సెంటిమెంటు డైలాగుల‌ను టీడీపీ మీడియాలో ప్ర‌సారం చేయించారు. అయితే, ప్ర‌జ‌లు వీటిని లైట్‌గానే కాకుండా నాట‌కంగానే భావించారు. దీంతో కోడెల వారి ఎపిసోడ్ ముగిసిపోయింద‌ని అంటున్నారు. ఇక, కోడెల‌పై వైసీపీ నాయ‌కులు దాడి చేశారా?  ప్ర‌జ‌లే తిర‌బ‌డ్డారా? అనే విష‌యం సోష‌ల్ మీడియాలో వీడియో రూపంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: