భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పై కాంగ్రెస్ తరపున ప్రియాంకా వాద్రా పోటీ చేస్తారన్న విషయం కొన్ని రోజుల నుంచి సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై అనేక రకాల తర్జనభర్జనలు కాంగ్రెస్ లో కొనసాగుతున్నాయి కూడా. అయితే ప్రియాంక పోటీ పై  తుది నిర్ణయం రాహుల్ దేనని వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేయాలా లేదా అని నిర్ణయంపై రాహుల్ గాంధీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.కానీ  వారణాసి నుంచి తాను పోటీ చేస్తానని స్వతంత్రంగా చెప్పిన ప్రియాంక గాంధీ ఆ మేరకు కు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

 Image result for rahul gandhi

వారణాసి నుంచి మోడీని ఢీ కొట్టడానికి ప్రియాంక బరిలోకి దిగితే, కాంగ్రెస్ పని అంతేనని, ఇక తనని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటున్నారు విశ్లేషకులు. మోడీపై ప్రియాంక పోటీ చేస్తే ఏం జరుగుతుంది..? కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమిటి..??  అనే విషయాలను అంచనా వేస్తే...

 Image result for priyanka  gandhi vs modi

- మోడీకి  వ్యతిరేకంగా ప్రియాంకను గనుక నిలబడితే కమలంతో కాంగ్రెస్ పార్టీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటుంది. జాతీయ పార్టీల తరఫున ప్రధాన నాయకులు పరస్పరం పోటీ చేసుకోవడం అంటే అదొక సంచలనమే. అయితే అదే జరిగితే కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుందని కానీ  మోడీ మీద గెలవడం అంటే నల్లేరుపై నడక లాంటిది కాదని, మోడీ సొంత నియోజకవర్గంలో ఎంతో టఫ్ ఫైట్ అక్కడ ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

 Related image

ఇక ప్రియాంకను పూర్తిస్థాయిలో ఈసారి బరిలోకి దిగుతోంది కాంగ్రెస్ రాహుల్ కు చేతకాదని లెక్కలతో ఆమెను రంగంలోకి దించుతున్నట్లు గా ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి పరిణామాలు సమయంలో నీ మీద ఆమె పోటీ చేసినట్లయితే ఆమె కనుక మోడీపై ఓడిపోతే ఇక అంతే సంగతులు

 Related image

అయితే  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఈ విషయంపై  సోనియాకి కొన్ని కీలక సూచనలు చేశారట.  ప్రియాంకను అదనపు నేతగా ఉపయోగించుకుంటేనే మనకు మేలని అలా కాకుండా  ఆమెను ఒక అభ్యర్థిగా బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీకి కీలకమైన బ్రహ్మాస్త్రాన్ని నిరుపయోగం చేసినట్టవుతుందని తెలిపారట. అంతేకాదు కొందరు విశ్లేషకులు సైతం ప్రియాంక అభ్యర్థిగా బరిలో దించి కంటే ప్రచారానికి ఉపయోగించుకోవడం మంచిదని తెలిపారని కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోనియాగాంధీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి రాహుల్ ఈ విషయంలో ఎలాంటి స్పందన తెలియచేస్తారో వేచి చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: