కేసీఆర్‌.. ఈ మూడక్షరాల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి పదునైన మాటలే.. ఈ బక్కపల్చటి మనిషి తన మాటలనే బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి చేరాడు. ఆయన మాటలు ఓ బ్రాండ్.. అలా ఇంకొకరు మాట్లాడలేరు. ప్రజల్ని మాటల మాయాజాలంతో ఆకట్టుకోలేరు. 


ఏపీలో కేసీఆర్‌ లా మాటలతో మాయ చేయగల నాయకులు చాలా తక్కువ. ఇప్పుడు ఏపీకి ఆ లోటు తీర్చేలా కనిపిస్తునాడో వైసీపీ కుర్ర లీడర్. ఆయన పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు కుమారుడు సిద్దార్థరెడ్డి. 

పెదనాన్న ఇటీవలే టీడీపీలోకి వెళ్తే.. ఈ కుర్రాడు మాత్రం వైసీపీలో చేరాడు. జగన్ అంటేనే మండిపడే బైరెడ్డి కుటుంబం నుంచి సిద్దార్థరెడ్డి వైసీపీ వైపు వెళ్లడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడా కుర్రాడు తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 

జంకూగొంకూ లేకుండా.. అడ్డు అలుపూ లేకుండా అలవోకగా ఆ కుర్రాడు చేస్తున్న ప్రసంగాలు వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారాయి. ఆయన చంద్రబాబు రాజకీయ విధానంపై సెటైర్లు పేలుస్తూ అచ్చు కేసీఆర్ తరహాలోనే చంకనాలేదు.. వంటి పదాలనూ సింపుల్ గా వాడుక భాషలో కలిపేసి వదులుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: