ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎప్పుడూ గాంభీర్యంగానే ఉంటారు. ఆయ‌నను చూస్తే.. న‌వ్వాల‌ని అనిపించిన‌వాడు కూడా నోరు మూసుకుంటాడు. ఎప్పుడూ.. అభివృద్ధి.. విజ‌న్ అంటూ ఉరుకులు ప‌రుగులు పెట్టిన‌చంద్ర‌బాబుకు ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్ని క‌ల్లో ప్ర‌జ‌లు రెస్ట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా కాక‌పోయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌కు అనుకూలంగా మాత్రం ఓట్లు కుమ్మ‌రించార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు లోగుట్టును ముందుగానే గ్ర‌హించారో ఏమో.. ఆయ‌న ఉలికి ప‌డుతున్నారు. ఒక‌ప‌క్క జ‌గ‌న్‌ను ఎందుకు గెలిపిస్తారు?  నేర‌స్తుడికి ఎందుకు ఓట్లు వేస్తారు? అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. మ‌రోప‌క్క‌, ఈవీఎంల‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. 


ఎన్నిక‌ల సంఘంపై చంద్ర‌బాబు స‌మ‌ర శంఖం పూరించారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్య వాదుల‌ను ఓ గాట‌న క‌ట్టుకుని తాను పోరుకు సిద్ధ‌మ‌వుతాన‌ని అన్నారు. ఇదిలావుంటే, ఎన్నిక‌ల‌కు ముంగిట చంద్ర‌బాబు వేసిన జిమ్మిక్కులు, చిక్క లును ప్ర‌జ‌లు బాగానే అర్ధం చేసుకున్న‌ట్టుగా ఉన్నారు.ఈ  క్ర‌మంలోనే వారు ఓ ర‌కంగా రియాక్ట్ అవుతున్నారు. చంద్ర బాబు, ఆయ‌న త‌న‌యుడుపై కూడా కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. స‌టైర్ల‌తో దుమ్ము దులుపుతున్నారు. ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో తెర‌మీదికి తెచ్చిన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధిస్తు న్నారు. ``అన్ని గేట్లూ ఉన్న కాళేశ్వరం అణిగిమణిగి ఉంటే, ఏ గేటూ లేని పోలవరం ఎగిరెగిరి పడిందంటా !`` అంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు, పోల‌వ‌రం ప్రాజెక్టుకు ముడిపెడుతూ మాట‌లు సంధిస్తున్నారు. 


అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిమాత్ర‌మే. ఆయ‌న‌కు ఎలాంటి ప‌వ‌ర్స్ కూడా ఉండ‌వు. అయినా కూడా ఆయ‌న పోల‌వ‌రంపై స‌మీక్షలు నిర్వ‌హిస్తున్నారు. అధికారుల‌ను ఆదేశిస్తున్నారు. ఇక‌, ఇలాంటి చ‌ర్య‌ల‌ను గ‌మ‌నించిన కొంద‌రు ``ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, అపద్ధర్మ ముఖ్యమంత్రికి అరుపులు ఎక్కువ !`` అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ మీద కూడా స‌టైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేష్‌కు.. ఆ నియోజ‌క‌వ‌ర్గం పేరు కూడా స‌రిగా ప‌ల‌కడం రాద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనిని ఆస‌రా చేసుకుని సోష‌ల్ మీడియాలో స‌టైర్లు ప‌డుతున్నారు. ``మందలిగిరి మాలోకానికి రిగ్గింగ్ చేయమని ఈవీఎం చేతికిస్తే, ఆ౯... ఊ౯... అన్నాడంటా  !``  అంటూ తెగ న‌వ్వుతున్నారు. 


ఇక‌, ఇదే పార్టీకి చెందిన చంద్ర‌బాబు అనుంగు అనుచరుడు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌పైనా స‌టైర్లు ప‌డుతున్నాయి. ఇ టీవ‌ల ఆయ‌న త‌న ఓట‌మిని గ్ర‌హించారో ఏమో ఎన్నికల వేళ చాలా వ్యూహాత్మ‌కంగా ఓ సెంటిమెంట్ డ్రామాకు తెరదీశా రు. ఇనిమెట్ల‌లోని ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి త‌లుపులు వేసుకుని త‌న‌కు తానే చొక్కా చించుకుని హైడ్రామాకు రూప‌క‌ల్ప‌న చేశారు. దీంతో ఈయ‌న‌పై కూడా స‌టైర్లు పేలుతున్నాయి. ``పోలింగ్ బూతు లోపలికి వెళ్ళి గడియ ఎందుకు పెట్టావంటే,  ఈవీఎం లకు ఆకలి వేస్తే పాలు పట్టడానికి అన్నాడంటా !`` అంటూ కోడెల‌పై స‌టైర్లు ప‌డుతున్నాయి. మొత్తానికి చంద్ర‌బాబు రాష్ట్రంలో ఓ వ్యంగ్య పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. సీఎంగా ఆ ధీమా.. ధైర్యం వంటివి కూడా ఆయ‌న‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: