అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా, అంతే హోరా హోరీగా సాగిన ఏపీ సార్వ‌త్రిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలోనూ అంతే ఉత్కంఠ కొన‌సాగుతోంది. మ‌రో నెల రోజుల‌కు పైగానే రిజ‌ల్ట్ కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్తితి నెల‌కొంది. అయి తే, రాష్ట్రంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అనే చ‌ర్చ కూడా జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా సంక్షేమ ప‌థ‌కాల ను అమ‌లు చేశాం.. ప‌సుపు-కుంకుమ వంటి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాం కాబ‌ట్టి.. మేమే అధికారంలోకి వ స్తామ‌ని టీడీపీ ఆశాభావంతో ఉంది. అయితే, ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు కాబ‌ట్టి .. తామే గెలుస్తామ‌ని వైసీపీ అం తే ధీమాగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు? ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? అనే ప్ర‌ధాన ప్ర‌శ్న లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 


ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కాశం.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ హోరా హోరీ పోరు సాగుతుంద‌ని స్ప‌ష్టంగా తెలు స్తోంది. అదేస‌మ‌యంలో ఎక్క‌డైనా టీడీపీ ఓడిపోయినా.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో పార్టీ గెలుపును కూడా టీడీపీ డిసైడ్ చేస్తుంద‌ని అంటున్నా రు టీడీపీ నాయ‌కులు. దీనికి అనేక కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఏదెలా ఉన్న ప్పటికీ.. రాష్ట్రంలోనిదాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లోటీడీపీ వ‌ర్సెస్ వైసీపీ హోరా హోరీ సాగుతుంద‌ని అంటున్నారు. ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ ఈ రెండు పార్టీల మ‌ధ్య జోరుగానే పోరు సాగుతుంద‌ని చెబుతున్నారు.జిల్లాల వారీగా తీసుకుంటే.,. కృష్ణాజిల్లా మైల‌వ‌రం, పెడ‌న‌, మ‌చిలీప‌ట్నం, పెన‌మ‌లూరు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ హోరా హోరీ సాగుతుంద‌ని మెజాటి మాత్రం వైసీపీకే వ‌స్తుంద‌ని అంటున్నారు. 


అదేవిధంగా అనంత‌పురం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు వంటి కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఎదురు గాలి వీచినా..బ‌ల‌మైన పోటీ మాత్రం సాగింద‌ని అంటున్నారు. ఇక‌, క‌డ‌ప‌లో పూర్తిగా టీడీపీ చేతులు ఎత్తేసింద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు  ఈ జిల్లాలో చేసిన విన్యాసంపై ఇక్క‌డి ప్ర‌జలు పెద్ద‌గాప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంకు స్థాప‌న చేసినా.. దానికి నిధులు ఎక్క‌డ నుంచి తెస్తార‌ని అంటున్నారు. పులివెందుల‌కు నీళ్లు ఇచ్చార‌ని చెప్పుకొ న్నా.. అది కూడా స‌క్సెస్ కాలేద‌న్న‌ది స్థానికుల మాట‌. ఎలా చూసినా.. టీడీపీ చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరా హోరీ పోరు ఇచ్చినా.. గెలుపు విష‌యంలో మాత్రం రెండు, కొన్ని కొన్ని చోట్ల మూడోస్తానంలోకి చేరిపోయింద‌ని అంటు న్నారు. ఏది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఏ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఉత్కంఠ మాత్రం మే 23 వ‌ర‌కు కొన‌సాగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: