ఎన్నికల ముగిశాక.. పార్టీలు వివిధ రకాలుగా తమ లెక్కల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. అయితే వైసీపీ తమ గెలుపు సీట్లపై ఓ క్లారిటీకి వచ్చింది. కానీ కొన్ని సీట్లలో మాత్రం విపరీతమైన టైట్ ఫైట్ కనిపిస్తోంది. 


ఈ సీట్లలో వైసీపీ గెలిస్తే.. జగన్ సీఎం అవడం ఖాయమని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. ఇక్కడ తాము గెలవచ్చు లేదా.. గెలుపును ప్రభావితం చేయవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఓ జాబితా తయారు చేసుకున్నారు. 

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, పాలకొండ, టెక్కలి, ఆమదాల వలస... విజయనగరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, శృంగవరపు కోట.. విశాఖ జిల్లాలోని విశాఖ విశాఖ ఈస్ట్, సౌత్, నార్త్ , వెస్ట్, అరకు వేలీ, పెందుర్తి, నర్సీపట్నం లో తాము గెలవచ్చు లేదా.. గెలుపును ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.  

కోస్తా జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు,రాజానగరం, మండపేట, రాజమండ్రి సిటీ, జగ్గంపేట... పశ్చిమగోదావరి జిల్లా ఉండి, తణుకు, పాలకొల్లు... కృష్ణా జిల్లాలోని తిరువూరు, గన్నవరం, విజయవాడ ఈస్ట్, నందిగామ... గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, పొన్నూరు,గుంటూరు ెస్ట్, ఈస్ట్ గురజాల.... ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, పరుచూరు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీలో తాము గెలవచ్చు లేదా.. గెలుపును ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.  

ఇక రాయలసీమలో కడప జిల్లాలోని బద్వేలు, ప్రొద్దుటూరు... కర్నూలు జిల్లాలోని  నంద్యాల, కోడుమూరు, ఎమ్మిగనూరు... అనంతపురం జిల్లా- ఉరవకొండ, కల్యాణ దుర్గం, హిందూపురం, మడకశిర, పెనుకొండ.. చిత్తూరు జిల్లా చిత్తూరు, పూతలపట్టు, పలమనేరుల్లో తాము గెలవచ్చు లేదా.. గెలుపును ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.  అంటే ఈ సీట్లే వైసీపీ గెలుపును డిసైడ్ చేస్తాయన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: