ఏపీలో అధికారంలోకి రావాలంటే ఆ జిల్లాలు అత్యంత కీలకం. ఇది ఇవాళ కాదు, ఉమ్మడి ఏపీ నుంచి వస్తున్న సెంటిమెంట్. ఎందుచేతనంటే అక్కడ‌ ఉన్న అసెంబ్లీ సీట్లు చాలా ఎక్కువ. అక్కడ జనం జై కొడితే సీఎం పీఠం పట్టేయవచ్చు. గతసారి అదే జరిగింది. టీడీపీ గెలవడానికి ఆ జిల్లాలు చేసిన సాయం అంతా ఇంతా కాదు.


మరి ఇపుడు ఆ జిల్లాలు ఫేస్ టర్నింగు ఇచ్చుకుంటాయా. అంటే పోలింగ్ సరళి చూస్తే అదే అనిపిస్తోందని అంచనా కడుతున్నారు. ఏపీలో అతి కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇపుడు సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. అక్కడ ఉన్నవి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు, తూర్పులో 19, పశ్చిమలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ అధిక సీట్లలో వైసీపీ, జనసేనల మధ్యన జరిగిందని అంటున్నరు. దాంతో టీడీపీ మూడవ స్థానానికి పడిపోయిన సీట్లు ఈసారి ఎక్కువేనని చెబుతున్నారు.


ఇక కొన్ని సీట్లలో టీడీపీ, వైసీపీ మధ్యన పోటీ ఉందంటున్నారు. అంటే అటు జనసేన అయినా, ఇటు టీడీపీ అయినా కామన్ ఫ్యాక్టర్ మాత్రం వైసీపీగా ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే గోదావరి జిల్లాల్లో వైసీపీ గణనీయమైన ప్రభావం చూపించి ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈసారి జగన్ ముఖ్యమంత్రి  అవడానికి గోదావరి జిల్లాల్లు  రాజద్వారాలు తెరచినట్లే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: