ఎన్నికల తర్వాత ఏపీలో ప్రధాన నాయకులు ఏదో ఒక రూపంలో ఇప్పటివరకూ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు రోజూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. జగన్ ఒకటి రెండు సార్లు బయటికొచ్చారు. కానీ పవన్ మాత్రం బయటకు రాలేదు. మౌనం వహిస్తున్నారు. 


ఏం చేసినా వచ్చే సీట్లు వస్తాయి. చేయాల్సిన కష్టం చేశారు. ఇక ఫలితం కోసం ఎదురుచూడటమే తప్ప మరో అవకాశం లేదు. అందుకే ప్రశాంతంగా ఉండటమే మంచిదని పవన్ ఫీలైనట్టున్నారు. పవన్ కల్యాణ్ మొదట్లో ఉన్న ఊపు చూపలేకపోయారని.. బలమైన అభ్యర్థుల్ని పెట్టలేదని.. పవన్ కల్యాణ్‌పై విమర్శలు వస్తున్నాయి. 

ఐతే.. అభ్యర్థులతో పెద్దగా పనేం లేదు.. పవన్ కల్యాణ్‌ను చూసి ఓట్లేస్తారన్న ఉద్దేశంతో బలమైన అభ్యర్థుల్ని పెట్టాల్సిన పని లేదన్న వాదన జనసేన వర్గాల నుంచి వస్తుంది. అయితే.. దీన్ని ఇతర పార్టీలు రాజకీయగా వాడుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీతో రహస్య అవగాహనలో భాగంగానే.. ఇలా అభ్యర్థులను పెట్టలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ రాజకీయ పోరాటం వ్యూహాత్మకంగానే చేశారు.

కమ్యూనిస్టులు, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ అది సరిపోలేదు. టీడీపీ, వైసీపీల మధ్య పూర్తిగా కేంద్రీకృతమైన రాజకీయపోరాటం జరిగింది కాబట్టి.. మరో శక్తిగా ఆవిర్భవించడానికి అవసరమైన బలం.. జనసేనకు.. కమ్యూనిస్టులు, బీఎస్పీతో రాలేదు. టీడీపీ, వైసీపీకి సీట్లు బాగా రావొచ్చు. జనసేనకు ఓట్లు.. సీట్లు కూడా రావొచ్చు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లు విజయం సాధించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

అధికారానికి పోటీ పడిన ఓ సీరియస్‌ చాలెంజర్‌గా ప్రజలు భావించలేదు. పవన్ కల్యాణ్ కూడా తనది పాతికేళ్ల రాజకీయం అని చెబుతూ ఉంటారు. అధికారం వస్తుందా.. రాదా అని.. టీడీపీ, వైసీపీలు కిందా మీదా పడుతున్నాయి. కానీ ఆ టెన్షన్ జనసేనకు లేదు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లభిస్తుందా..? అసెంబ్లీలోకి జనసేన ఎమ్మెల్యేలు అడుగుపెడతారా..?. హంగ్ ఏర్పడుతుందా..? అన్నదే ఇప్పుడు కీలకం. 



మరింత సమాచారం తెలుసుకోండి: