అప‌ర‌చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు టెన్ష‌న్‌కు గుర‌వుతున్నారా? ఆయ‌న‌లో ఆశ‌లు ఆవిరి అవుతున్నాయా ?  గెలుపుపై ధీమా పోతోందా ?  విజ‌యంపై ఆశ‌లు కొడిగ‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నెల 11న రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల విష‌యంపై అనేక తర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం, టీడీపీ గెలుపు సాధ్యం కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పైకి మాత్రం గాంభీర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం చంద్ర‌బాబు దిగులు పెట్టుకున్నార‌ని అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు చంద్ర‌బాబు త‌న వ‌ద్ద ఉన్న అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగించేశారు. 


సంక్షేమం, ప‌థ‌కాలు, మ‌హిళా ఆక‌ర్ష‌క పథ‌కాలు ఇలా అన్ని విధాలా ఆయ‌న వేయ‌ని అడుగులు, చూప‌ని దూకుడు లేనే లేవు. అయినా కూడా ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగా మారిపోయార‌ని ఇప్ప‌టికే ఇంటిలిజెన్స్ స‌ర్వేలు చంద్ర‌బాబు ఉప్పందించాయి. దీంతో ఆయ‌న తోక‌కాలిన కోతి మాదిరిగా ఎన్నిక‌ల సంఘంపై రెచ్చిపోతూ.. త‌న‌దైన శైలిలో గొంతు విరుచుకుని మాట్టాడుతున్నారు. అయినా కూడా ఫ‌లితం ఎప్పుడో డిసైడ్ పోయింద‌ని అంటున్నారు. ఏ ప‌దిమందిని ప్ర‌శ్నించినా.. కూడా ముగ్గురు మాత్ర‌మే టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. దీంతో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఈవీఎంపై దాడిని పెంచారు. ఈవీఎంలు మోసం చేశాయ‌ని, సైకిల్‌కు ఓటేస్తే.. ఫ్యాన్ గుర్తుకు ప‌డింద‌ని ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. 


అయితే, ఎన్నిక‌ల సంఘం మాత్రం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌ను లైట్‌గా తీసుకుంది. ఇదిలావుంటే, ఎలాగూ, త‌ను ఓట‌మి అంచుకు చేరిపోయిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇప్పుడే అలెర్ట్ అయ్యారు. ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చేందుకు ముందు రోజు అంటే మే 22న పార్టీ అభ్య‌ర్థుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆయ‌న నోటీసులు పంపిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే ప్ర‌స్తుత విప‌క్షం వైసీపీ మెజారిటీ స్థానాల‌కు ఓ ఐదారు స్థానాల‌నుగెలుచుకోలేని ప‌రిస్థితిలో ఉంటే.. వెంట‌నే టీడీపీ నుంచి గెలిచిన వారికి వ‌ల విసిరే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని అరికేట్టేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని అంటున్నారు. అంటే.. త‌న పార్టీ నుంచి ఎవ‌రు గెలిచినా కూడా వైసీపీ జోలికి పోకుండా జ‌గ‌న్ చెంత‌కు చేర‌కుండా ఉండేందుకు గాను ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా చంద్ర‌బాబు మే 22న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: