జనసేనకు ఏపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి..? ఈ ప్రశ్నకు సమాధానం చాలా రకాలుగా వస్తోంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా.. అన్నీ సగటున ఓ పది సీట్లు వస్తాయేమో అన్న భావన ఉంది. అది కూడా చాలా ఎక్కువ అని భావిస్తున్నవారు చాలామంది ఉన్నారు.


జాతీయ సర్వేలు, చాలా లోకల్ సర్వేలు చెబుతున్నదైతే.. ఐదు లోపే. మరి ఈ సమయంలో జనసేనకు 88 సీట్లు వస్తాయి.. అధికారంలోకి మేమే వస్తాం అని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నమ్మకంగా చెబుతున్నారు. ఎన్నికల ముందు ఎన్నయినా చెప్పొచ్చు.

కానీ ఎన్నికలు ముగిశాక అలా చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. ఇప్పటికే ఈవీఎంలో ఓట్లు నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడు తీర్పు మారదు. ఐతే జేడీ అంత ధైర్యంగా ఎలా చెబుతున్నారు. ఆయన వాదన ఇలా ఉంది. పవన్ కల్యాణ్ భీమవరంలో పోటీ చేయడం వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో .. గాజువాకలో పోటీ చేయడం వల్ల ఉత్తరాంధ్రలో జనసేన స్వీప్ చేయబోతోందట.

ఈ రెండు ప్రాంతాల్లోనే 60- 70 సీట్లు వస్తాయట. ఇక మిగిలిన రాష్ట్రమంతా మరో 20 సీట్లు వస్తాయట. ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని.. అలాగే ప్రతిపక్షంపైనా సానుకలత లేదని..దీంతో జనం జనసేన వైపై ఉంటారని జేడీ అంచనా. మరి ఈ అంచనా ఎంతవరకూ నిజమవుతుందో ఫలితాలు వస్తే కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: