విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీలో జగన్ తరువాత నెక్స్ట్ లీడర్. జగన్ తరువాత పార్టీని కంట్రోల్ చేసేది విజయసాయి రెడ్డి. అయితే టీడీపీ నేతల మాటలకూ ఎదురు దాడి చేసే భాద్యతను విజయ సాయిరెడ్డి తీసుకున్నాడు. కౌంటర్లు ఓ రేంజ్ లో పడుతున్నాయి. అయితే ఇప్పుడు పోలింగ్ ముగిసినా వైసీపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం ముద‌రి పాకాన ప‌డుతోంది. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకోవ‌డంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌డంలేదు.


న్నికలు, ఈవీఎంల వ్యవహారంపై వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒక‌రి మీద ఒక‌రు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో పోలింగ్ రోజు జరిగిన గొడవపై ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కోడెల వ్య‌వ‌హారం హాట్ టాఫిక్‌గా మారింది. ప్ర‌తిప‌క్ష‌పార్టీ త‌ప్పుడు కేసు పెట్టార‌ని కోడెల ఆరోపించ‌డంతో వెంట‌నే విజ‌య‌సాయిరెడ్డి ట్విట్టర్‌లో ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.


అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఒక వీధి రౌడీలా పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు తెగబడటం దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. చంద్రబాబు నేర సామ్రాజ్యంలో అచ్చోసిన ఆంబోతుగా మారిన కోడెల ఓటమి నిస్పృహతో రెచ్చిపోయారు. రాజకీయాలను నేరమయం చేశావు కదా చంద్రబాబూ!’అంటూ నిప్పులు చెరిగారు. దీనితో టీడీపీ నాయకులకు ధీటైన సమాధానాలు ఇవ్వటంతో టీడీపీ నాయకులూ ఆత్మ రక్షణలో పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: