పోలింగ్ సందర్భంగా తలెత్తిన అవకతవకలకు చంద్రబాబునాయుడే కారణమా ? చంద్రబాబు కుట్ర ఫలితంగానే పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జాప్యం జరిగిందా ? అవుననే అంటోంది జగన్ మీడియా. పోలింగ్ లో జరిగిన అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా సీరియస్ గా ఉందట. అందుకు అవసరమైన అన్నీ ఆధారాల సేకరణపై దృష్టిసారించిందట. ఎక్కడైనా పోలింగ్ జరగటానికి లేదా జాప్యం జరగటానికి రిటర్నింగ్ అధికారులదే బాధ్యత. అలాంటిది రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన వారంతా చంద్రబాబు ఏరికోరి నియమించుకున్న అధికారులే అన్న విషయాన్ని సీఈసీ గుర్తించిందని సమాచారం.

 

ఉదయం పోలింగ్ మొదలైన దగ్గర నుండి ఓటింగ్ సరళిపై ఎప్పకప్పుడు సమాచారం తెలుసుకుంటున్న చంద్రబాబు కావాలనే ఓటింగ్ ను జాప్యం చేయించారని సీఈసీకి సమాచారం అందిందట.  అంటే చంద్రబాబు ఆదేశాలమేరకే రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కు అంతరాయాలు కల్పించినట్లు ఇపుడు బయటపడుతోందని సమాచారం. 46, 500 పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు కొన్నిచోట్ల మాత్రమే మొరాయించాయి. పైగా ఈవిఎంల్లో సమస్యలు తలెత్తినపుడు రిపేర్ చేయటం కోసం భెల్ నుండి 600 మంది నిపుణులను ఎన్నికల కమీషన్ నియమించింది.

 

ఈవిఎంల్లో సమస్యలు తలెత్తినపుడు వాటిని బావుచేయించకుండా కొన్ని చోట్ల రిజర్వు ఈవిఎంలను ఉపయోగించారని గుర్తించింది ఈసీ. భెల్ నిపుణులను దగ్గర పెట్టుకుని కూడా వారి సేవలను ఎందుకు ఉపయోగించుకోలేదన్నది పెద్ద ప్రశ్న. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లోను రిటర్నింట్ అధికారులను నియమించింది చంద్రబాబే. అదికూడా మంత్రులు, ఎంఎల్ఏలతో చర్చించిన తర్వాత నమ్మకస్తులను వడబోసి మరీ చంద్రబాబు ఎంపిక చేసి ఎలక్షన్ కమీషన్ కు అప్పగించారట. రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన వారికన్నా అనుభవం ఉన్నా, సీనిరయర్లున్నా వారిని కాదని వీరినే ఎందుకు నియమించుకుందనే విషయంలో సీఈసీ అధ్యయనం చేస్తోంది.

 

పైగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను కూడా చంద్రబాబే ఏరికోరి తన మనుషులను నియమించుకున్నారు. కాబట్టి ఎన్నికలంటే కలెక్టర్లు, ఎస్పీలే కీలకం. వారికితోడు రిటర్నింగ్ అధికారులు కూడా తన వారే అయినపుడు ఇంక ఎదురే ఉండదని అనుకున్నారు చంద్రబాబు. కానీ చివరకు అనుకున్నదొకటి అయ్యిందొకటిగా మారిపోయిందట. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లో కూడా టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయట. దాంతో చంద్రబాబుకు దిమ్మతిరిగిందని సమాచారం. తర్వాత మొదలైన పోలింగ్ లో కూడా ఎక్కువ ఓట్లు వైసిపికి పడుతున్నాయని సమాచారం అందుకున్నారట.

 

ఎప్పుడైతే ఓటింగ్ సరళి వైసిపికి అనుకూలంగా ఉందని అర్ధమైపోయిందో రిటర్నింగ్ అధికారుల ద్వారా పోలింగ్ ను జాప్యం చేయించారట కావాలనే. ఆ విషయంలోనే ఇపుడు ఎన్నికల కమీషన్ దృష్టి సారించింది. అందులో భాగంగానే అందరూ కలెక్టర్లపైన సీరియస్ అయి నోటీసులిచ్చింది.  రిటర్నింగ్ అధికారులపై చర్యలు తప్పవని అర్ధమైపోయింది కాబట్టే రిటర్నింట్ అధికారులపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ డిప్యుటీ కలెక్టర్ల సంఘం ఎన్నికల కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేదిని కలవటం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంటే రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్లు నోరిప్పితే కానీ సస్పెన్స్ వీడదు

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: