ఇపుడిదే అంశంపై తెలుగుదేశంపార్టీ జనాల మధ్య చర్చలు జరుగుతోంది. నిజానికి ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పటి నుండి ప్రస్తుత ఆంధ్రా ప్రాంతంలోకన్నా తెలంగాణా ప్రాంతంలోనే పార్టీ చాలా బలంగా ఉండేది. ఎందుకంటే, టిడిపికి మొదటి నుండి బిసిల మద్దతే కీలకంగా ఉండేది. బిసిలు ఏపిలో కన్నా తెలంగాణాలోనే బలంగా ఉన్నారు. దానికి తోడు ఇతర సామాజికవర్గాలు కూడా మద్దతుగా నిలవటంతో తెలంగాణాలోనే పార్టీ బలంగా ఉండేది.

 

అలాంటి తెలంగాణాలోనే టిడిపికి పునాదులు కదిలిపోయాయి. దాంతో కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కారణం ఏమిటంటే, రాష్ట్ర విభజన సందర్భంగా చంద్రబాబునాయుడు అనుసరించిన విధానమే కారణం. నిజానికి రాష్ట్ర విభజన టిడిపిలో చాలామంది నేతలకు ఇష్టం లేదు. అయితే, రాష్ట్ర విభజన జరగకపోతే భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి రావటం కష్టమని చంద్రబాబు అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే రెండు వరుస ఎన్నికల్లో టిడిపి ఓడిపోయుంది.

 

సో నేతలు ఎంత మొత్తుకున్నా వినకుండా రాష్ట్ర విభజనకే చంద్రబాబు కట్టుబడున్నారు. సరే మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిపోయింది. ప్రస్తుత పరిస్ధితేంటయ్యా అంటే తెలంగాణాలో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. టిడిపి కంచుకోటలన్నింటినీ టిఆర్ఎస్ కబ్జా చేసేసింది. ఇక్కడే అందరిలోను ఏపి పరిస్ధితిపై ఆందోళన మొదలైంది.

 

ఎంతో బలంగా ఉన్న పార్టీ తెలంగాణాలో  తుడిచిపెట్టుకుపోతే  ఏపిలో పరిస్ధితేంటి ? ఏమిటంటే ఏపిలో కూడా తొందరలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పార్టీ నేతల్లో చంద్రబాబు నాయకత్వం మీద విశ్వాసం దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. అదే సమయంలో నారావారి పుత్రరత్నం నారా లోకేష్ మితిమీరిన జోక్యం కారణంగా సీనియర్లు చాలామందిలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. ఎటువంటి సామర్ధ్యం లేకుండానే లోకేష్ అన్నీ విషయాల్లో వేలు పెట్టటాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

రేపటి కౌంటింగ్ లో గనుక  టిడిపి ఓడిపోతే అంతే సంగతులు. ఏపిలో కూడా పార్టీకి తెలంగాణాలో పరిస్ధితే అని అంచనాలు పెరిగిపోతున్నాయి.  1983 ఎన్నికల నుండి టిడిపి అత్యధికసార్లు గెలుస్తుచుకున్న నియోజకవర్గాలు దాదాపు 40 ఉన్నాయి.  రేపటి ఎన్నికల్లో టిడిపి గనుక ఓడిపోతే ఏపిలో కూడా కంచుకోటలు బద్దలైనట్లే. ఒకసారి కంచుకోటలు బద్దలైతే ఇక మళ్ళీ కట్టటం కష్టమే.  ఏ సంగతి తేల్చుకునేందుకు నేతలందరూ మే 23వ తేదీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: