దేశాభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే రవాణా సౌకర్యాలను చూస్తే తెలుస్తుందనేది ఓ నానుడి. అలా చూసినపుడు మన దేశం చాలా వెనుకబడి ఉన్నట్లే లెక్క. ఎందుకంటే, సాంకేతికంగా ఎంతో  అభివృద్ధి చెందామని అనుకున్న రవాణా సౌకర్యాల విషయంలో మాత్రం వెనకబడి ఉన్నట్లే లెక్క. అందుకు తాజాగా జరిగిన పోలింగే నిదర్శనం.

 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం జరిగిన రెండోదశ పోలింగ్ సందర్భంగా పోలింగ్ సామగ్రిని తరలించాల్సొచ్చింది. మామూలుగా మైదాన ప్రాంతాలకు తరలించటానికి అధికారులకు రవాణా సౌకర్యాలున్నాయి. కానీ ఎత్తైన కొండలు, లోయలు, పర్వత ప్రాంతాలకు సామగ్రిని తరలించాలంటే మరి మార్గమేంటి ? ఏమిటంటే గాడిదలే గతి.

 

అవును నిజంగానే గాడిదలపైనే పోలింగ్ సామగ్రిని అధికారులు తరలించారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు కొండలపైన ఏర్పాటు చేశారట. అంటే మైదాన ప్రాంతాల నుండి సుమారు 11 కిలోమీటర్లు కొండలపైకి ప్రయాణం చేయాలి. మరి అన్ని కిలోమీటర్లు సామగ్రిని మోసుకెళ్ళటమంటే కష్టమే. అందుకే అధికారులు సామగ్రి మొత్తాన్ని గాడిదలపైన వేసుకుని వెళ్ళారు.

 

ఈ పరిస్ధితి ఒక్క తమిళనాడులోనే కాదు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, అస్సాం లాంటి కొండలు, పర్వతాలెక్కువన్న రాష్ట్రాల్లో సర్వసాధారణం. పై రాష్ట్రాల్లోని జనాలు రోజువారి సామగ్రిని కూడా గాడిదలు లేకపోతే గుర్రాలపైనే మోసుకుని వెళతారు. ఇపుడు ఎన్నికల సీజన్ కదా ? అందుకే అధికారులు ముందుగానే మాట్లాడుకుని సామగ్రి మొత్తాన్ని గాడిదలపై మోసుకుని వెళ్ళారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: