ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉన్నట్లు అనిపిస్తోంది కదా. తప్పేమీ లేదు మీరు ఊహించింది కరెక్టే. చంద్రముఖిలోని చాలా పాపులర్ డైలాగ్ అది. మాములుగా గంగ పాత్రలో ఉండే జ్యోతిక ఒక్కోసారి మాత్రం చంద్రముఖిలా మారిపోతుంటుంది. ఇపుడు చంద్రబాబునాయుడు పరిస్ధితి కూడా అలాగే తయారైందా ? అన్న అనుమానం పెరిగిపోతోంది. తాజాగా కాపు కార్పొరేషన్ ఎండి శివశంకర్ ను బదిలీ చేయటం వివాదాస్పదమైంది.

 

గడచిన ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు ఎలాగున్నా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి మాత్రం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు మానసిక పరిస్ధితిపై చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా ఇపుడెందుకంటే, తాజాగా రెండు రోజుల్లో రెండు అంశాలను చూసిన తర్వాత అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

 

పోలింగ్ అయిపోయినా ఫలితాలు ఇంకా రాలేదు. మేనెల 23వ తేదీ ఫలితాలు వచ్చినా మరో నాలుగు రోజుల పాటు అంటే మే 27వరకూ ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి ఎటువంటి సమీక్షలు పెట్టకూడదు. ఉన్నతాధికారులను తన దగ్గరకు పిలిపించుకోకూడదు. ఎటువంటి ఆదేశాలను ఇవ్వకూడదు. బదిలీలు చేయకూడదు. ఎవరిని బదిలీ చేయాలన్నా ఎన్నికల కమీషన్ కే అధికారం. ఈసి అధికారాలను సిఎం కూడా ప్రశ్నించేందుకు లేదు.

 

అలాంటిది ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు బదిలీపై ఏకంగా కోర్టులో కేసే వేశారు. ఎన్నికల కమీషన్ అధికారాలను ప్రశ్నించారు. సరే హై కోర్టు మొట్టికాయలు వేయటంతో నోరు మూసుకుని కూర్చోవాల్సొచ్చింది. చంద్రబాబు ఒత్తిడికి లొంగి ఈసి అధికారాలను ప్రశ్నించిన చీఫ్ సెక్రటరీ పునేఠా కూడా అందుకు మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది లేండి. అదే సమయంలో ముగ్గురు ఎస్పీలను కూడా బదిలీ చేశారు.

 

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈసి ఎవరినైనా బదిలీ చేయవచ్చు అని తెలిసి కూడా చంద్రబాబు ఎన్నికల కమషన్ తో గొడవ పెట్టుకుంటున్నారు. కోడ్ కు విరుద్ధంగా  సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల కమీషన్ ఆగ్రహంతో చివరకు మానుకున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ ఎండి శివశంకర్ ను చంద్రబాబు బదిలీ చేశారు. బదిలీ చేయటంపై చంద్రబాబుకు ఎలాంటి అధికారం లేదు. అయినా సరే ఎండిని బదిలీ చేసి మళ్ళీ ఈసీతో గొడవ పెట్టుకుంటున్నారు.  ఎన్నికల దెబ్బకు చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిలా మారిపోయారా అన్న అనుమానాలు  పెరిగిపోతున్నాయి. మరి మామూలు చంద్రబాబులా ఎప్పుడు మారుతారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: