అవును పోలింగ్ జరిగిన విధానంపై సమీక్ష చేద్దామని ఆదేశించిన తర్వాత కూడా చాలామంది అభ్యర్ధులు చంద్రబాబుకు పెద్ద షాకే ఇచ్చారు. కర్నాటకలోని  రాయచూర్ కు ఎన్నికల ప్రచారం కోసం వెళదామని అనుకున్నారు చంద్రబాబు. అయితే, మధ్యలో కర్నూలులో కాసేపు ఆగుదామని అనుకున్నారు. ఎలాగూ ఆగుతున్నాం కాబట్టి జిల్లాలోని ఎంపి, ఎంఎల్ఏ అభ్యర్ధులతో సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

 

సరే చంద్రబాబు చెప్పిన విషయాన్ని పార్టీ ముఖ్యులు జిల్లాలోని అభ్యర్ధులకు, సీనియర్ నేతలందరికీ చేరవేశారు. అనుకున్నట్లుగానే చంద్రబాబు కూడా కర్నూలులో దిగారు. ఒర్వకల్లు రాక్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబు అనుకున్నట్లుగా అందరు నేతలు హాజరుకాలేదు సమీక్షకు. అదేమంటే హాజరైన వారు ఏవో కారణాలు చెప్పారట. రాని నేతల గురించి వచ్చిన నేతలను అడిగితే ఏమి సమాధానం చెబుతారు ?

 

మొత్తం మీద పార్టీ నేతల నుండి సమాచారం అందుకున్న తర్వాత కూడా  ఎంఎల్ఏ అభ్యర్ధులు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, కెఈ శ్యాంబాబు, టిజి భరత్, తిక్కారెడ్డి, మీనాక్షీ నాయుడు, కెఈ ప్రతాప్ గైర్హాజరయ్యారు.  సరే చేసేదేముందని హాజరైన నేతలతోనే చంద్రబాబు ఏదో మొక్కుబడిగా సమీక్ష జరిపామనిపించి సమావేశం ముగించుకుని వెళ్ళిపోయారు.  పాపం అధికారం చివరలో నేతలు చంద్రబాబు గట్టి షాకే ఇచ్చారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: