ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఇటీవ‌ల కాలంలో తెర‌మీదికి వ‌స్తున్న ప్ర‌శ్న ఇది. త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఎలాంటి విజ‌నూ లేకుండానే తాను విజ‌న్ ఉన్న నాయ‌కుడిన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబు.. పార్టీని నాకించేస్తున్నార‌ని అంటున్నారు. చంద్ర‌బాబుకు ప్ర‌త్యేకంగా విజ‌న్ ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో అక్కడి అధికార పార్టీ ప్లే చేసిన లోక‌ల్ నినాద‌మే ఇప్పుడు ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప‌ట్టుకుని వేలాడారు. నాటి ఎన్నిక‌ల్లో త‌గుదున‌మ్మా అంటూ.. బ‌లం లేక పోయినా.. పెట్టుకున్న కండ‌ల‌తో రెచ్చిపోయిన చంద్ర‌బాబును కేసీఆర్ లోక‌ల్ నినాదంతో ప్ర‌జ‌ల‌తో త‌రిమి కొట్టించారు. 

Related image

ఇక‌, టీడీపీ పోయినా ఫ‌ర్లేదు. కానీ, అంతో ఇంతో అధ‌కారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేదా.. మ‌రిన్ని సీట్లు గెలుచుకునికేసీఆర్ కు స‌వాల్ రువ్వే అవ‌కాశాన్ని సైతం కాంగ్రెస్ చేజార్చు కోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో 2014లో కంటే కూడా చాలా త‌క్కువ సీట్టే అక్క‌డ కాంగ్రెస్‌కు వ‌చ్చాయి. దీనికితోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయారు. దీంతో కాంగ్రెస్ మ‌ట్టికొట్టు కుపోయింది. ఇక ఇప్పుడు ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ వైసీపీ బ‌లాన్ని త‌గ్గించేందుకు, ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేసేందుకు చంద్ర‌బాబు వేసిన పాచికే.. లోక‌ల్ కాన్సెప్ట్. దీనిని అడ్డు పెట్టుకుని గెలిచిపోవాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, ఏపీ ప్ర‌జ‌లు సెంటిమెంట్ ఫూల్స్ కార‌న్న కొంద‌రి మాటే నిజ‌మైంది. ఇక్క‌డ బాబు గారి ప్లాన్ స‌క్సెస్ అయిన‌ట్టు క‌నిపించ‌లేదు. 


అదే స‌మ‌యంలో వంగి వంగి ద‌ణ్నాలు పెట్ట‌డాన్ని కూడా కొన్ని వ‌ర్గాలు ఎబ్బెట్టుగానే భావించాయి. మేధావి వ‌ర్గాల్లో చంద్ర బాబుకు మంచి ఇమేజ్ ఉంది. కానీ, ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం బాబు వేసిన ఫీట్ల‌ను చూసివారువిస్మ‌యానికి గుర‌య్యా రు. ఇక‌, ఇప్పుడు అధికారంలోకి వ‌స్తామా?  రామా అనే అనుమానం చంద్ర‌బాబును ప‌ట్టిపీడిస్తోంది. మ‌రోప‌క్క‌, గ‌ట్టి భ‌రోసాతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఒక వేళ‌.. త‌న‌కు ప‌ది సీట్లు అటుఇటుగా వ‌చ్చినా.. మేజిక్ ఫిగ‌ర్‌ను చేరుకునేందుకు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. చంద్ర‌బాబు వారిని అడ్డుకునే అవకాశం ఉంటుంద‌ని అన‌లేం. 

Image result for tdp logo

నీవు నేర్పిన విద్య‌యే నీర‌జాక్షా!! అంటూ.. బాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు జ‌ల్ల‌కాయ్ కొట్టే ఛాన్స్‌ను తోసిపుచ్చ‌లేం. ఇక‌, ఇప్ప‌టికే చంద్ర‌బాబు మిలిట‌రీ డిసిప్లేన్‌తో అల్లాడిపోతున్న వారు కూడా ఎప్పుడు బాబుకు బై చెబుదామా? అనే ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ కి ఎంత‌మంది గెలిచినా.. అధికారంలోకి వ‌చ్చేంత మేజిక్ ఫిగ‌ర్ రాక‌పోతే.. క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను నాకించేసిన బాబు.. ఏపీలో టీడీపీని మ‌ట్టిలో క‌లిపేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: