పివి నరసింహారావు మరణం తరవాత కాంగ్రెస్ వైభవం క్రమంగా, మన్మోహన్ సింగ్  ప్రధానిగా ఉన్నప్పుడు పూర్తిగా కుప్ప కూలి పోయింది. నానాటికీ చిక్కి శల్యమవుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు రావాలంటే కొత్త రక్తం రూపంలో ప్రియాంకా గాందీ రావాల్సిందే. ఈ మాట చాలా కాలం నుంచే వింటున్నాం. ప్రియాంకా గాంధీ - గాంధీ కుతుంబ ఆడపడుచే అయినా, రాబర్ట్ వాద్రాతో పెళ్లి అవతంతో ప్రియాంకా వాద్రాగా మారిపోయారు. అయినా కూడా ఆమెకు గాంధీ వారసత్వ వాసనలు, ఇందిరా గాంధి రూపురేఖలు పోలేదు. 
Image result for narendra modi in varanasi
పెళ్లై ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ప్రియాంకను గాంధీ ఫ్యామిలీ వారసురాలిగానే కాంగ్రెస్ వాదులంతా  భావిస్తున్నారు. గతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభం లో పడిపోయిన తరుణంలో ఒకసారి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, ఆ తరవాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీల మాదిరిగా ప్రస్తుత తరుణంలో పార్టీని నడిపించే వారు ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదు. రాహుల్ గాందీ పార్టీ పగ్గాలు చేపట్టినా, ఆయన అంతగా ఆకట్టుకోలేక పోతున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రియాంక గాంధి బరి లోకి దిగితేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న మాట వినిపిస్తోంది.
Image result for spiritual city varanasi
ఈ భావన నిజమేనన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కూడా చిన్నచిన్నగానే అయినా ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి కీలక నిర్ణయాలే తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఉత్తర ప్రదేశ్ తూర్పు విభాగం పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంకకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 


ఈ ఎన్నికల్లో కేవలం ప్రచారానికే పరిమితమవుతారా? లేదంటే, ఎన్నికల్లో పోటీకి దిగుతారా? అంటూ ప్రియాంకపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. “ఇలాంటి తరుణంలో పార్టీ ఆదేశిస్తే ఈ సారే పోటీకి అదే వారణాసి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీకి కూడా సిద్ధమేనని ప్రకటించిన ప్రియాంక సంచలనం రేకెత్తించారు. ప్రియాంక పోటీ ఖాయమేనన్న కోణంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా మరో సంచలన ప్రకటన చేశారు. 


ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేసిన వాద్రా, అంతకు మించిన సంచలన ప్రకటన మరొకటి చేశారు. ఈ ఎన్నికల్లోనే పోటీకి దిగనున్న ప్రియాంక నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ బరిలోకి దిగుతున్న వారణాసి నుంచే పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన ఎన్నికల సమరాంగనంలో పెను సంచలనమే రేపిందని చెప్పాలి. 

Image result for all prime ministers from indian national congress

వారణాసి నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక సిధ్ధంగానే ఉన్నారని, అయితే పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ప్రియాంక పోటీకి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉన్నా, స్వయంగా ప్రియాంక భర్త రాబర్ట్ నోట నుంచి ఈ తరహా ప్రకటన రావడంతో దేశ రాజకీయాల్లో ఈ విషయంపై పెద్ద చర్చకే తెర లేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే వారణాసి నుంచి మరోమారు బరిలోకి దిగేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు.  


గడచిన ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేసిన నరేంద్ర మోదీ ఈ సారి ఒకే చోట నుంచి బరిలోకి దిగుతున్నారు. అది కూడా తన సొంత రాష్ట్రం గుజరాత్ నుండి కాకుండా ఉత్తరప్రదేశ్ లోని ఆద్యాత్మిక నగరం భారత సంస్కృతికి హైదవ సాంప్రదాయానికి కేంద్రం అయిన వారణాసిని ఆయన ఎంచుకున్నారు. ప్రియాంక గాంధి పోటీ గనుక ఖాయమే అయితే, నరేంద్ర మోదీకి ముచ్చెమటలు పట్టడం, మోడి మనోఫలకంపై తారలు కనిపించటం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. సోనియా గాంధితో పాటు రాహుల్ గాందీ కూడా యూపీ నుంచే పోటీ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 
Image result for radhi priyaanka gandhi saradhi chandrababu
అంతే కాకుండా అచ్చుగుద్దినట్టు ఇందిరా గాంధీ పోలికలతో ఉన్న ప్రియాంక గాంధి బరిలోకి దిగితే మాత్రం నరేంద్ర మోదీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన కాంగ్రెస్ నాయకుల్లో  వినిపిస్తోంది.  మరి ఇప్పటికే ఈ మేరకు సంచలనాలకు కారణం కానున్న ప్రియాంక గాంధి పోటీకి కాంగ్రెస్ అధిష్ఠానం ఏమంటుందో? చూడాలి.
Image result for narendra modi priyanka gandhi
ఇకపోతే అసలు ఏపి అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రతిపక్షం అని చెప్పొచ్చు. అంతేకాదు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వినిపిస్తున్న ప్రధాన గళాల్లో - ప్రమధ గణాల్లో ప్రధముడు. వారణాసి నుండి నరేంద్ర మోదీ పార్లమెంట్ మెంబర్ గా కొనసాగుతున్నారు. రెండోసారి ఆయన వారణాసి నియోజకవర్గం బరిలో దిగుతుండగా, ఆయనపై పైన చెప్పుకున్నట్లు “కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం ప్రియాంక గాంధీ” పోటీ చేస్తే ఆ యఙ్జానానికి చంద్రబాబు ప్రచార సారధ్యం వహిస్తే  ప్రియాంక గెలుపు నల్లేరు మీద నడకైపోతుందని నమ్మే వారున్నారు. తెలుగు వారు అధికంగా ఉన్న వారణాసిలో చంద్రబాబు ప్రచారంలో దున్నేస్తారు. దుమ్ము దులిపేస్తారు. దేశంలో నరేంద్ర మోడీ శత్రువులంతా చంద్రబాబు మిత్రులే కావటం చూస్తూనే ఉన్నాం.
Related image
ఊళ్ళో పెళ్ళైతే శునకాలకు హడావిడైనట్లు మోడీపై ఎవరు సమరానికి సిద్ధమైనా చంద్రబాబు సిద్ధమై పోతుంటారు.. ఇంకా తెలుగుదేశంలోని ప్రత్యేక సామాజికవర్గం, పచ్చ మీడియా చంద్రబాబు ఈ చావు తెలివి తేటల్ని "చాణక్యం" అంటుంటారు . అందుకే దేశంలో కాకపోయినా కనీసం ఏపిలో వారణాసిని కీలకం చేసేస్తారు.  

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: