ఐదేళ్ల పాలనాకాలంలో ఏపీలో ఎంతో మంది టీడీపీ నాయకులు ఎన్నో అరాచకాలు చేసినా చట్టం వారి చుట్టంగా మారిపోయింది. టీడీపీ నాయకులు చట్టం చేతులు కట్టేయడంతో వారిపై చర్యలు కాదు కదా కనీసం కేసులు తీసుకునేందుకు కూడా ఎవ్వరూ సాహసించని పరిస్థితి. చట్టం కూడా టీడీపీ నేతల అధికారానికి భయపడి తన పని తాను చెయ్యలేకపోయింది. అయితే ఇప్పుడు అధికారం ఈసీ చేతుల్లో ఉండడంతో టీడీపీ నేతలు చేసిన గత నేరాలపై చట్టం తన పని తాను చేసుకుపోయేందుకు సిద్దం అవుతోంది. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు కోడెల శివరాంపై చట్టం ఇప్పుడు కొరడా ఝళిపించనుంది. ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో కేఎస్పీ ట్యాక్స్‌ పేరుతో జరిగిన అరాచకాల గురించి... ఐదేళ్ల పాటు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే కాకుండా గుంటూరు జిల్లా జనాలంతా కథలు కథలుగా చెప్పుకున్నారు. 

Related image

ఇక అసలు విషయంలోకి వెళ్తే శాటిలైట్‌ పైరసీకి పాల్పడుతూ కోట్ల రూపాయిలు దండుకుంటున్నట్టు ఆరోప‌ణ‌లు ఉన్న‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు తనయుడు శివరాంకృష్ణకు చెందిన కే ఛానల్‌ కార్యాలయంలో ఢిల్లీ హైకోర్ట్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన అడ్వకేట్ కమిషన్‌ సోదాలు నిర్వహించింది. ఫే  ఛానల్స్‌ అయిన జీ, స్టార్‌ మా ఛానల్స్‌కు సంబంధించి ఆయా సంస్థల నుంచి ఎలాంటి ప్యాకేజ్‌ అనుమతులు లేకుండా డీటీహెచ్‌, సన్ డైరెక్ట్‌ ద్వారా ఈ ఛానల్‌ను శాటిలైట్‌ పైరసీకి పాల్పడుతున్న ఈ ఛానల్‌ గత కొన్ని ఏళ్లుగా కోట్లాది రూపాయిలు అక్రమార్జ‌న‌లకు పాల్ప‌డిన‌ట్టు వీరు గుర్తించినట్టు తెలుస్తోంది. ఫే ఛానళ్లు ప్రసారం చేసే కేబుల్ నెట్‌వర్కులు ముందుగా ఆ ఛానళ్లకు సంబంధిత ప్యాకేజి చెల్లించి ప్రసార హక్కులు తీసుకుని తమ కేబుల్‌ ద్వారా వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. 


కే ఛానల్‌ స్టార్ ప్యాకేజి ప్రసారహక్కులు తీసుకుని ఉంటే ఒక్కో వినియోగదారుడి నుంచి రూ. 39, జీ ప్యాకేజ్‌కు సంబంధించి రూ. 25 చల్లించాల్సి ఉంది. ఇలా ఒక్కో ఏడాది సుమారు 6 కోట్ల రూపాయిలు చెల్లించాలి. అయితే తండ్రి కోడెల శివప్రసాద్‌ అధికారం, అండదండలతో సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో ఐదేళ్లుగా విచ్చలవిడిగా చెలరేగిపోయిన శివరాం ఇక్కడ శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ ఈ 6 కోట్ల రూపాయిలు ఆ ఛానల్స్‌కు చెల్లించకుండా ఎస్కేఫ్‌ అయినట్టు తెలుస్తోంది. ఇది సాంకేతిక పరమైన నేరాల లెక్కలోకి వస్తుంది. ఛానళ్ల ప్రతినిధులకు సంవత్సరానికి 6 కోట్లు ఎగ్గొట్టిన శివరాం వినియోగదారుల నుంచి ప్రతి నెల కోట్లలో సొమ్ము వ‌సులు చేసుకున్నట్టు టాక్‌. కే ఛానల్‌ చేస్తున్న ఈ అక్రమ వ్యవహారాన్ని స్టార్‌ ప్లస్‌ ప్రతినిధులు రెండు సంవత్సరాల క్రితమే గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే నిందితుడు స్పీకర్‌ కుమారుడు కావడం ఏదైనా తేడా జరిగితే జిల్లాలో తమ ఛానల్‌ ప్రసారాలు ఎక్కడ నిలిచిపోతాయో అన్న ఆందోళనతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. 

Image result for kodela siva prasad rao family

అదే టైమ్‌లో అటు పోలీసులు కూడా శివరాంపై కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వెయ్యడంతో బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందిన దేశ ఉన్నత న్యాయస్థానం శాటిలైట్‌ పైరసిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ ఏర్పాటు చెయ్యడంతో ఈ సభ్యుల బృందం గురువారం గుంటూరు జిల్లాలోని స్పీకర్‌ కోడెల క్యాంప్‌ కార్యాలయంలో ఉన్న కే ఛానల్‌లో తణికీలు చేసింది. కే ఛానల్‌లో కమిషన్‌ సభ్యులు తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు ఒక్క సారిగా అక్కడకు చేరుకుని ఆ సభ్యులతో గొడవకు దిగడంతో పాటు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆ సభ్యులు తమ విధులకు అడ్డగిస్తే కోర్టు దిఖ్కారం పరిధిలోకి వస్తుందని అప్పుడు మీపై కేసు నమోదు అవుతుందని హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గారు. 


స్థానిక టూ టౌన్ పోలీసుల సహాకారం తీసుకున్న కమిషన్‌ సభ్యులు శాటిలైట్‌ పైరసీకి ఉపయోగించిన ఎన్‌కోడర్‌, సెట్‌టాప్‌ బాక్సులను స్వాధీనం చేసుకుని స్థానిక పోలిస్‌ స్టేషన్‌కు తరలించినట్టు తెలిసింది. ఏదేమైన ఐదేళ్ల కాలంలో ఈ జంట నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలను సైతం దోపిడి చేసేందుకు ఏ మాత్రం వెనకాడని ఆ యువ లీడర్‌ ఇప్పుడు ఏకంగా కొత్త తర‌హా దందాకు తెర తీసినట్టు తెలియడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ శాఖలో సైతం రైతులకు ఇచ్చే యంత్రాలపై వచ్చిన రాయతీని సైతం ఎవ్వరికీ తెలియకుండా తమ ఖాతాలో వేసుకున్నట్టు టాక్‌. మరి రాబోయే రోజుల్లో వీరి గురించి ఇంకెన్ని లొసుగులు, దందాలు వెలుగు చూస్తాయో అన్న చర్చ కూడా గుంటూరు జిల్లాలో నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: