ఏపి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు రాజ్యాంగ విరుద్ధంగా మారిపోతుందని అధికార వర్గాల నుండి స్పష్టంగా వినిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నవేళ ముఖ్యమంత్రికి నూతన మరియు విధానపర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండవు. అధికారాలు ఒక్క శాంతి భద్రతలు ప్రకృతి విపత్తుల విషయంలో మాత్రమే వినియోగించుకోవచ్చు. కాని చంద్రబాబు నలభైయేళ్ళ సుధీర్ఘ అనుభవం ఉండి ఇలా రాజ్యాంగ వ్యవస్థ, "కార్య నిర్వాహక వ్యవస్థ"పై దాడి చేసినట్లే ఔతుందని అంటు న్నారు రాజకీయ విశ్లేషకులు కొంత రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు కూడా. 
Image result for chandrababu attacks on constitutional body ec & executive
అయితే శాసన నిర్మాణ వ్యవస్థ - కార్య నిర్వాహక వ్యవస్థ పై దాడి చేసే తీరు అంటే ఏపీలో ముఖ్యమంత్రి వర్సెస్ ముఖ్య కార్యదర్శిగా జరుగుతున్న రాజకీయాలు అధికారు లకు మాత్రం క్లిష్టంగా మారి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే బాధ్యత మరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహిస్తుండటం, వాటికి వెళ్లక పోతే ఆయన ఆగ్రహానికి గురవుతామన్న ఆందోళనతో, అక్కడికి వెళుతున్న అధికారులను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరణ కోరడం ఇప్పుడు సంచలనం గా మారింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా ఈసీపై ఆగ్రహాన్ని సీఎస్ మరియు ఇతర అధికారులపై చూపిస్తుండటం ఇక్కడ మరో కొత్త సమస్యగా మారింది.
Image result for chief secretary of ap 2019

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన శాఖల అధిపతుల పరిస్ధితి, ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారుతోంది. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే చంద్రబాబు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి లెవెల్లో నిర్వహిస్తున్న సమీక్షలకు ఇకపై హాజరవ్వాలో? లేదో? తెలియని గందరగోళ పరిస్ధితి వారిలో నెలకొంది. దీనికి కారణం తాజాగా చంద్రబాబు నిర్వహించిన పోలవరం, సీఆర్డీయే సమీక్షలే. నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతి సోమవారం సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు, ఎన్నికల నేపథ్యంలో వాటికి కాస్త విరామం ఇచ్చారు. ఎన్నికల పోలింగ్ ముగియడంతో మళ్ళా  యథావిథిగా సమీక్షలకు తెరలేపారు.
Image result for CM Vs CS in AP now
కోడ్ అమల్లో ఉన్న సందర్భాన్ని పట్టించు కోకుండా కీలకమైన పోలవరంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, అటు సీఆర్డీయే పనితీరు పైనా సమీక్షించారు. ఎమ్మెల్యేల నివాస సముదాయాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో సీఎం సమీక్షల నిర్వహణను తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్ష వైసీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ, కోడ్ అమల్లో ఉండగా, కీలక సమీక్షల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సీఈవో గోపాల కృష్ణ ద్వివేదీని ఆదేశించింది. దీంతో ఆయన అధికారులకు ఆదేశాల బుక్-లెట్స్ అందజేశారు. 


ఒక వైపు ఈసీ సీరియస్ అయినా సీఎం ఇవేవీ పట్టించు కోకుండా ఇవాళ కాపు కార్పోరేషన్ ఎండీ శివశంకర్‌ ను బదిలీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, అధికారుల బదిలీల వ్యవహారం ఈసీ చేతుల్లో ఉంటుందని తెలిసినా, ప్రభుత్వం తరఫున జీవో జారీ చేయటం సంక్లిష్ట పరిస్థితులకు దారి తీసింది. దీంతో సీఈసీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యాన్ని వివరణ కోరింది.
Image result for CM Vs CS in AP now
వెంటనే ఆయన సీఎం సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీచేశారు. తగిన వివరణ రాకపోతే తక్షణచర్యలు తీసుకునేందుకు ఈసి సైతం సిద్ధమవుతున్నట్లు గా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లక్ష్యంగా చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సీఎస్‌గా పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి బాధ్యత లు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ముందు నుంచీ ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు, ఆయన్ను వైఎస్ జగన్ కేసుల నిందితుడిగా పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. 
Related image
ఎన్నికల పోలింగ్ రోజున మంగళగిరి లోని డీజీపీ కార్యాలయానికి సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యం వెళ్లడం పైనా చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణం లో కీలక సమీక్షలకు తెరలేపడం వెనుక ఎల్వీ సుబ్రహ్మణ్యం టార్గెట్ చేశారా? అనే వాదన వినిపిస్తోంది. కోడ్ ఉల్లంఘనలు జరిగితే ఈసీ ముందుగా ప్రశ్నించేది అధికారుల ప్రధాన అధిపతి అయిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నే. అందుకే దీనిపై సమాధానం ఆయనే చెప్పుకుంటారన్న ఉద్దేశంతో రెండు రోజులుగా సమీక్షలతో పాటు బదిలీ నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. చివరికి చంద్రబాబు చేస్తున్న పనులకు తాను ఇరుకున పడటంతో చేసేది లేక ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేశారు. తగిన సమాధానం రాకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Image result for gopal krishna dwivedi
అయితే విఙ్జులైన అధికారులకు "ఏ విషయాలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయో తెలియదా?" ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నపక్షంలో ఆయన ఆదేశాలు పాటించ కూడదు కదా! కేంద్ర స్థాయి ఐఏఎస్ అధికారులకు తాము శాసన నిర్మాణ వ్యవస్థ" మాదిత్రిగా "కార్య నిర్వాహక వ్యవస్థ" కు చెందిన వారమని తెలియదా! ముఖ్య మంత్రి మాట వినటం కాదు చట్టం ఏమి చెపుతుంది? అన్నది ముఖ్యం. అది మరచిన వారు అసలు ఆ ఉద్యోగాల్లో కొనసాగటం వృధా అని అంటున్నారు.  

Image result for LV Subrahmanyam Vs Chandrababu

ఈసీ ఆదేశాలతో సిఎం సమీక్షలకు విధి విధానాలు, పని సంస్కృతి  తెలిసిన సీనియర్లు హాజరు అవ్వటం ఆగిపోగా, ముఖ్య మంత్రి కి సమాచారం చేరవేసే అలవాటున్న సామాజికవర్గానికి చెందిన వాళ్లు అటుదిటు చెప్పి పబ్బం గడుపుకునే చంచా గాళ్ళు మాత్రమే ప్రస్తుతం హాజరు అవుతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: