ఎన్నికలకు ముందు దాదాపు అన్ని పార్టీలు ఈసారి సర్వే చేయించుకున్నాయి. ఆ సర్వే నివేదికల ఆధారంగానే కొన్ని పార్టీలు టికెట్టు కూడా కేటాయించాయి. అంతే కాదు.. ఎన్నికల తర్వాత కూడా సర్వేలు చేయించుకుంటున్నాయి. తమ పార్టీ పరిస్థితి ఏంటన్నదానిపై అంచనాకు వస్తున్నాయి. 


ఐతే.. జగన్ స్వయంగా చేయించుకోకపోయినా.. ఆయన పార్టీ పెద్ద తలకాయలు చేయించిన దాదాపు ఆరు సర్వే రిపోర్టులు ఇప్పుడు జగన్ చేతికి చేరాయట. ఇంతకీ ఆ సర్వే రిపోర్టుల్లో ఏముందంటే.. ఈ ఆరు సర్వేల్లో ఒకే ఒక్క సర్వే 80 నుంచి 90 మధ్యలో జగన్ కు సీట్లు వస్తాయని చెప్పిందట. 

మిగిలిన అన్న సర్వేలు 90 పైనే ఫిగర్ చెప్పాయట. కొన్ని సర్వేలు ఏకంగా 130 వరకూ రావచ్చని కూడా చెప్పాయట. అంటే దాదాపు అన్ని సర్వేలు జగన్ గెలుపును ఖాయం చేశాయన్నమాట.  

ఈ సర్వేల మాట ఎలా ఉన్నా.. జగన్ ఎక్కువగా నమ్మే ప్రశాంత్ కిషోర్ మాత్రం జగన్ 115- 125 వరకూ సీట్లు వస్తాయని ఇప్పటికే రిపోర్టు ఇచ్చేశాడని తెలుస్తోంది. ఇప్పుడు నేతలు ఈ సర్వే రిపోర్టులన్నీ ముందేసుకుని ఎక్కడ లాభపడతాం.. ఎక్కడ నష్టపోతున్నామనే లెక్కలు వేసుకుంటున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: