ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల కంటే జనసేనపై చాలా రకాలుగా బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మూడు రకాలుగాఈ బెట్టింగ్ సాగుతోంది. 


మొదటిది.. పవన్ కల్యాణ్ కేంద్రంగా ఉంది. పవన్ రెండు చోట్ల పోటీ చేసినందువల్ల.. ఎక్కడ నుంచి గెలుస్తాడు.. రెండూ గెలుస్తాడా.. ఒక్కటి గెలుస్తాడా అన్న కోణం ఒకటి. ఎంత మెజారీటీ వస్తుందన్న విషయం మరొకటి.. వీటిపై బెట్టింగులు సాగుతున్నాయి. 

రెండోది.. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందనే అంశంపై బెట్టింగులు సాగుతున్నాయి. 20లోపా.. పది లోపా.. ఐదా.. అన్న అంశాలపై పందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక మూడోది మరీ ఆసక్తికరం.. అదేంటంటే.. రాష్ట్రంలో హంగ్ వస్తుందా రాదా.. జనసేన కింగ్ మేకర్ అవుతుందా కాదా అనే అంశం.

అయితే గతంలో లాగా ఈసారి కోట్లకు కోట్ల రూపాయలు పందేల్లో ఎవరూ కాయడం లేదట. ఈ మూడు రకాల్లో కూడా ఒకటికి రెండు, ఒకటికి మూడు స్థాయిలో జరుగుతోందట. గతంలో ఒకటికి పది తరహాలో కూడా జరిగినా ఇప్పుడా సీన్ లేదట. ఇదీ పవన్ పై బెట్టింగుల కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: