ఏపీలో పోలింగ్ జరిగింది. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. మరో నెల తరువాత కానీ ఎవరి జాతకాలు ఏంటన్నది బయటపడవు. అయితే గెలుపుపై ప్రధాన పార్టీల అంచనాలు ఎవరివి వారివి ఉన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ తామే గెలిచేస్తామంటూ గట్టిగానే బయటకు చెప్పుకుంటున్నాయి. 



అయితే వైసీపీలో కనిపిస్తున్న అంత ధీమా అధికార టీడీపీలో కనిపించడంలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇపుడు తాపీగా పోలింగ్ సరళిని మధింపు చేసుకుంటున్న టీడీపీకి ఓ విషయం స్పష్టంగా అర్హమైందట. తాము వూహిస్తున్నట్లుగా అనుకూలత ఓటు కంటే వ్యతిరేక ఓటింగ్ చాలా ఎక్కువగానే ఉందని తలలు పండిన టీడీపీ నేతలు ఓ అంచనాలు వస్తున్నారు. ప్రభుత్వ అనుకూలతకు కూడా ఎన్నో ఆంశాలు ఉన్నా వాటిని సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయామని కూడా బాధ పడుతున్నారట.



ఇక ఇపుడున్న పరిస్థితుల్లో పసుపు కుంకుమ, పించన్లు, అమరావాతి పనులు, పోలవరం వంటివేమైనా గట్టెక్కిస్తే తాము బొటా బొటీ మెజారిటీకి చేరువ అవుతామని భావిస్తున్నారుట. ఒకవేళ అది కాకుండా వ్యతిరేక ఓటు బలంగా ఉంటే వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే తాము బలమైన పోటీ ఇచ్చామని, అధికారంలొకి రాకపోయినా ఎక్కువ సీట్లు వస్తాయని కూడా అంచనా వేసుకుంటున్నారు.
అదే సమయంలో వైసీపీ గెలిచినా ఆ పార్టీకి వచ్చే సీట్లు 90 నుంచి 95 మించవని కూడా టీడీపీ అంతర్గత సంభాషణల్లో లెక్కలు కడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో విజయావకశాలు ఎవరికైనా ఫిఫ్టే ఫిఫ్టీ  అన్నది టీడీపీ శిబిరంలో వినిపిస్తున్న మాటగా ఉంది. చూడాలి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: