ఏపీలో కులాల కుంపట్లు ఎలా ? ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోస్తా జిల్లాల్లో రాజకీయాలను కులాలు ప్రభావితం చేస్తుంటాయి. చాలా మంది పార్టీ కోసం కాకుండా అరే వీడు మన కులపోడురా వీడికే మనం ఓటు వెయ్యాలని ఎక్కువగా చర్చించుకుంటారు. ఏపీలో రాజకీయాన్ని డామినేట్‌ చేస్తున్న మూడు ప్రధాన సామాజికవర్గాలైన కమ్మ టీడీపీ వైపు మొగ్గు చూపుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ సామాజికవర్గానికి చెందిన మెజారిటీ ఓటర్లు ఆ పార్టీకే జై కొడుతున్నారు. ఇక రాయలసీమలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ముందు నుంచి కాంగ్రెస్‌ ఆ తర్వాత వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇక రాష్ట్ర జనాభాలో కమ్మ, రెడ్డి సామాజికవర్గం కంటే బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గం ఓటర్లు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో ఆ పార్టీ వైపు ఎక్కువగా వెళ్లారు. ఇక తాజా ఎన్నికల్లో చిరు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ స్థాపించడంతో ఆ పార్టీ వైపు ఆసక్తి చూపినట్టు ప్రాధమిక అంచనా. 

Image result for chandrababu-pavan-jagan

ఇక మూడు సామాజికవర్గాల ఓట్లు పక్కన పెడితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపాయో అన్నదే ఆసక్తికరం. ఈ సామాజికవర్గాల ఓట్లు ఏ పార్టీ ఎక్కువగా సాధిస్తే రేపు ఏపీలో వాళ్లదే గెలుపు కానుంది. ఇక రాష్ట్ర జనాబాలో సగానికి పైగా ఉన్న మెజారిటీ వర్గాలైన బీసీలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా ఉంటున్నారు.  బీసీల ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకు కొంత వైసీపీ, జనసేన వైపు మల్లిందని స్పష్టంగా తెలుస్తోంది. బీసీలకు తెలుగుదేశం పార్టీ సరైన పథకాలు ఇవ్వలేదని, ఐదేళ్లలో పార్టీ కోసం ఎంతో కమిట్‌మెంట్‌తో ఉంటున్న తమకు కొత్తగా జరిగిన‌ న్యాయం లేదని భావించిన బీసీల్లో  20 నుంచి 25 శాతం వరకు వైసీపీ వైపు మొగ్గు చూపారు. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వడంతో పాటు... ఆ సామాజికవర్గాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నారని భావించిన బీసీల్లో తట‌స్తులు వైసీపీతో పాటు కొందరు జనసేన వైపు కూడా మొగ్గు చూపారు. 


అదే టైమ్‌లో పవన్‌ కళ్యాణ్‌ అన్ని కులాలను కలుపుకుని వెళ్తానని చేసిన ప్రసంగాలుతో పాటు బీసీల‌లో పవన్‌ వీరాభిమానులుగా ఉన్న వారు సైతం ఈ సారి జనసేనకు ఓటు వేశారు. ఓవర్‌ ఆల్‌ బీసీ ఓటు బ్యాంకులో 20 నుంచి 25% వైసీపీకి మల్లితే  మరో 10% జనసేనకు మల్లింది. ఇక ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించే ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో మెజారిటీ ఓటింగ్‌ ముందు నుంచి అనుకున్నట్టుగానే వైసీపీకే పడింది. ఈ సామాజికవర్గం ఓటింగ్‌లో 70-80% ఓటింగ్‌ ఫ్యాన్‌ గుర్తుకే పడ్డాయి. ముందు నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉంటూ వస్తున్న ఈ ఓటర్లు గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ వైపే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సామాజికవర్గంలో జనసేన సైతం కొంత ఓటు బ్యాంకు పట్టికెల్లిపోగా మిగిలిన ఓటింగ్‌ టీడీపీతో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీలు పంచుకున్నాయి. ఈ సారి ఎస్సీల ఓటు బ్యాంకు టీడీపీకి చాలా చాలా నామా మాత్రంగానే పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Image result for chandrababu-pavan-jagan

ఇక మైనార్టీలు ముందు నుంచి టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఆ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తాజా ఎన్నికల్లో ఈ సారి మేనార్టీలు కూడా కొంత వరకు టీడీపీ వైపు మొగ్గు చూపినా ఆ వర్గంలో 60-70% వైసీపీకే ఓట్లు వేశారు. మరో 10% జనసేన వైపు వెల్లగా 20-25% మాత్రం టీడీపీకి ఓట్లు వేశారు. గతంతో పోలిస్తే మైనార్టీ ఓటు బ్యాంకు టీడీపీకి కొంత అదనంగా కలిసి వచ్చినప్పటికి ఓవర్‌ ఆల్‌గా మాత్రం మూడు వంతులకు కాస్త అటూ ఇటూ ఓటు బ్యాంకును వైసీపీ పట్టికెల్లిపోయింది. ఏదేమైన గతంలో తమకు పట్టున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు టీడీపీకి బాగా పట్టున్న బీసీ ఓటు బ్యాంకును సైతం ఈ సారి వైసీపీ కొంత వరకు కొల్లకొట్టిందని పోలింగ్‌ సరళి చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: