ఏపీలో ఇపుడు ఓ పార్టీ పేరు బాగా మారుమోగుతోంది. ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏదీ అంటే వైసీపీ అని అంతా చెప్పుకుంటున్నారు. జగన్ సైతం తానే కాబోయే సీఎం అంటున్నారు. పోలింగ్ సరళిని చూసిన మీదట ఆయన ఈ రకమైన అంచనాకు వచ్చారు. ఇక ఏపీ ఎన్నికల్లో హరా హోరీ పోరు సాగిందని అందరూ అంటున్నా వైసీపీ  మాత్రం వార్ వన్ సైడే అని డిసైడ్ అయిపోయింది.



దానికి తోడు వచ్చిన సర్వేలు కూడా ఇప్పటివరకూ జగనే సీఎం అని చెప్పేశాయి. ఇక పోలింగ్ రోజు కూడా భారీ ఎత్తున మహిళలు, ఇతర వగాలు వచ్చి ఓటు చేశాయి. ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలమని వైసీపీ భావిస్తోంది. నిజానికి 2014 ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి ఈసారి ఎన్నో రకాలుగా అనుకూలమైన పరిస్థితి కనిపించింది. గత రెండేళ్ళుగా  వైసీపీ వేవ్ ఏపీలో ఏర్పడింది. దాన్ని ఎక్కడా తగ్గకుండా వైసీపీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది.



జగన్ పాదయాత్రకు వచ్చిన స్పందన అలా ఉండగానే తొలి విడతలో ఏపీలో ఎన్నికలు ఈసారి జరిగాయి. ఇది నిజంగా వైసీపీకి ఓ పెద్ద  ప్లస్ పాయింటుగా చెప్పుకోవాలి. ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత ఎక్కువగా చంద్రబాబు తనదైన వ్యూహాలు అమలు చెసేందుకు  అవకాశం ఏర్పడేది. దాన్ని లేకుండా చేయడం జగన్ కి పెద్ద అడ్వాంటేజ్. అంతే కాదు. ఈసారి జగన్ వ్యూహాలకు తోడుగా పొరుగున కేసీయార్ కూడా అంది వచ్చారు. తలపండిన కేసీయార్ ఏపీలో వైసెపీ గెలుపు కోసం గట్టిగానే తెర వెనక క్రుషి చేసారు.



అదే విధంగా కేంద్రంలో మోడీతో సున్నం పెట్టుకున్న  టీడీపీకి ఈసారి ఎన్నికల్లో అధికారం ఉన్నా కూడా పూర్తిగా దాన్ని వాడుకోలేకపోయింది. ఎన్నికల్లో  అనుకూలంగా  పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం లభించలేదు. ఎక్కడికక్కడ  టీడీపీని కట్టడి చేస్తూ పోయారు. పేరుకే అధికారం అన్నట్లుగా బాబు పరిస్థితి తయారైంది. దాంతోనే ఆయన ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ మాదిరిగా ఈసీ మీద పోరాడారు. 
ఇలా అన్ని వైపులా జగన్ కి ఈసారి ఎన్నికలు కలసివచ్చాయి. ఇంతటి అనుకూలత మళ్ళీ ఆయనకు ఎపుడూ రాదు, రాబోదు. మరి ఇవన్నీ కలసి జగన్ని సీఎం చేస్తాయా అన్న‌దే ఇపుడు చూడాలి. ఇంతటి అనుకూలతలోనూ అవకాశం చేజారితే మాత్రం జగన్ జాతకాన్నే ఇక అంతా తప్పుపట్టాల్సివస్తుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: