రాష్ట్రమంతటా ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగితే పీలేరులో మాత్రం ఒకరోజు ముందుగానే ఓటింగ్ జరిగిందా ? అవుననే అంటున్నారు.  అందులోను పీలేరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 273లో ముందురోజు అంటే ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రమే ఓట్లు పడ్డాయట. అదికూడా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆమోదంతోనే ఓటింగ్ జరిగిందనే విషయం ఇపుడు సంచలనంగా మారింది.

 

273 పోలింగ్ కేంద్రంలో ముందురోజు సాయంత్రమే ఓటింగ్ చేసిన విషయం తాలూకు వీడియో క్లిప్పింగ్ ఎన్నికల కమీషన్ కు అందిందట.  తనకందిన వీడియో క్లిప్పింగ్ చూసిన  ఈసీ కంగుతిన్నది. దానికితోడు పోలింగ్ కు ముందురోజు ప్రభుత్వ ఐటి సలహాదారు, గతంలో ఈవిఎం చోరీ కేసులో ఇరుక్కున్న వేమూరి హరిప్రసాద్ తో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణ కూడా బయటపడింది.

 

ఈవిఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ లో హరిప్రసాద్ నిపుణుడు. అటువంటి హరిప్రసాద్ ను ఏరికోరి చంద్రబాబు తన దగ్గర ఐటి సలహాదారు హోదాను కట్టబెట్టి మరీ పెట్టుకున్నారు. అటువంటి హరిప్రసాద్ తో జిల్లా కలెక్టర్లు ప్రత్యేకించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గోప్యంగా ఉంచాల్సిన  ఈవిఎంకు సంబంధించిన విషయాలు ప్రస్తావించటంపై ఎన్నికల కమీషన్ మండిపోతోంది.

 

ఇది చాలదన్నట్లు పోంలింగ్ రోజున జరిగిన గొడవలపై నివేదిక ఇవ్వమని ఈసి అడిగితే ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని నివేదిక ఇచ్చారు. పోలింగ్ సంబంధింత గొడవల్లో  తంబళ్ళపల్లిలో వైసిపి నేత ఒకరు మరణించారు. కుప్పం పరిధిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో నాలుగు వివిప్యాట్లను టిడిపి శ్రేణులు బద్దలు కొట్టాయి. పూతలపట్టు వైసిపి అభ్యర్ధి ఎంఎస్ బాబును టిడిపి వాళ్ళు చచ్చేట్టు కొట్టారు.

 

చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో యధేచ్చగా రిగ్గింగ్ జరిగింది. ఇవి కాకుండా మరికొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఓటింగ్ విషయంలో గొడవలు జరిగాయి. ఇన్ని గొడవల మధ్య పోలింగ్ ముగిసినా ఒక్క గొడవ కూడా జరగలేదని కలెక్టర్ నివేదిక ఇవ్వటంపై ఈసి బాగా సీరియస్ గా ఉందని సమాచారం. పోలింగ్ కాదుకానీ మొత్తానికి కొందరు కలెక్టర్లు ఈసి దగ్గర ఇరుక్కోవటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: