ప్రస్తుతం ఈ విషయం మీదే రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుండి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గందరగోళం మొదలైంది. షెడ్యూల్ విడుదలైన దగ్గర నుండి ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు ఎన్నికల కోడ్ ను పాటించటం తక్కువనే చెప్పాలి. ప్రస్తుతం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేస్తున్న చేష్టలు చూస్తుంటే రోత పుడుతోంది.  పేరుకే చంద్రబాబునాయుడుకు 40 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ కానీ ఎందుకూ పనికిరాదు.

 

నరేంద్రమోడితో మొదలైన వ్యక్తిగత వైరం వల్ల ప్రతీ విషయంలోను చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.  ఉన్నతాధికారుల్లో ఎవరిని బదిలీ చేసినా గొడవ పెట్టుకుంటున్నారు. పోలింగ్  అయిపోయిన తర్వాత కూడా కోడ్ అమల్లో ఉన్నా  ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తున్నారు. సమీక్షలు చేయకూడదంటే ఎన్నికల సంఘం ఎవరు చెప్పటానికి అంటున్నారు.

 

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు చేయాల్సినవి ఏమిటి చేయకూడనవి ఏమిటి అనే విషయాలు చంద్రబాబుకు ఇంకోరు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, గతంలోనే రెండుసార్లు సిఎంగా చేశారు. 10 ఏళ్ళు ప్రతిపక్షనేతగా పనిచేశారు. కాబట్టి ఇపుడున్న రాజకీయనేతల్లో అందరికన్నా ఎన్నికల కోడ్ గురించి చంద్రబాబుకు ఎక్కువ తెలిసుంటుంది.

 

మరి నిబంధనలన్నీ తెలిసి కూడా చంద్రబాబు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు ? ఎందుకంటే కావాలనే. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం ఒకటి, ఎవరినైతే అడ్డంగా పెట్టుకుని ఎన్నికల్లో గెలుద్దామని అనుకున్నారో వాళ్ళందరినీ ఎన్నికల కమీషన్ హఠాత్తుగా బదిలీ చేసేయటం రెండో కారణం. దాంతో ప్రతీరోజు ఈసిపై అవసరం ఉన్నా లేకపోయినా నోరు పారేసుకుంటున్నారు.

 

ఈ పరిణామాలను చూస్తుంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసేస్తే బాగుంటుందని జనాల్లో చర్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి ఫలితాలు వెలువడే వరకూ రాష్ట్రంలో  గవర్నర్ పాలన పెట్టేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. పోటీ చేసే పార్టీలన్నీ ప్రతిపక్షాలుగానే ఉంటాయి అధికార దుర్వినియోగం జరగదు. ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు  నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఏమంటారు ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: