ఈ మద్య దేశ వ్యాప్తంగా డ్రగ్స్ విక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈజి మనీ కోసం కొంతమంది బడాబాబులు ఈ మార్గాన్ని ఎన్నుకొంటున్నారు. ఆ మద్య హైదారబాద్ లో భారీగా డ్రగ్స్ గుట్టు రట్టయిన విషయం తెలిసిందే.  అయితే డ్రగ్స్ పట్టుబడినప్పుడల్లా ఫిలిమ్ వర్గాల వైపు అరోపణలు రావడం మరో విశేషం.  తాజాగా సాగర నగరం యువత మత్తుకు చిత్తవుతున్నారు. పార్టీల పేరుతో లేట్ నైట్‌లు.. వీకెండ్ల పేరుతో లాంగ్ ట్రిప్సులు వేస్తూ తప్పుదోవ పడుతున్నారు. 


ఈ నెల 13న విశాఖలోని రుషికొండ ప్రాంతంలో సోనీ అనే వ్యక్తి నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. ఆ పార్టీపై రైడ్ చేయగా ఎన్నో సంచలన విషయాలు బయట పడ్డాయి. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీలాంటి మత్తుపదార్థాలను నిర్వాహకులు యూత్‌కు అలవాటు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న రేవ్ పార్టీ ఘటనలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పార్టీలో మద్యం తాగటానికి వీలుగా ఎక్సైజ్‌శాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే పార్టీలో మద్యంతోపాటు గోవా నుంచి తీసుకువచ్చిన ఎల్‌ఎస్‌డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడరులాంటి అత్యంత మత్తు కలిగించే మాదక ద్రవ్యాలను అందుబాటులో ఉంచారు. 


కాగా,  డ్రగ్స్‌ను తరలించేందుకు యత్నించిన సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము గోవా నుంచి విశాఖకు డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్టు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన ఐదుగురు యువకులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు.  అయితే ప్రధాన నిందితుడు సోనీ మాత్రం తప్పించుకున్నాడు.  వారి వద్ద నుంచి నగదు, డ్రగ్స్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: