అదేంటి ఆంద్రప్రదేశ్లో మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి కదా మళ్ళీ ఎన్నికలేంటి అనుకుంటున్నరా. తప్పదు, మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ  వినక తప్పదు.  ఎందుకంటే ఏపీలో ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా తొందరగానే.



ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగియడంతోనే మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిధ్ధపడుతున్నారు.  ఏపీలో ఎపుడో ఎన్నికలు జరిపించాలి. పాలక వర్గాల గడువు కూడా పూర్తి  అయింది. కానీ అసలైన ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఎందుకని ఆపేశారు. ఇలా ఎప్పటికపుడు వాయిదా పడిన మునిసిపల్ ఎన్నికలు ఇపుడు ఒక్కసారిగా తోసుకువస్తున్నాయి.
ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హై కోర్టు  మే 1 నాటికి ఓటర్ల జాబైతాను విడుదల చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది.



దీంతో మే 1న ఓటర్ల జాబితాను విడుదల చేసి ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేయనుంది. అంటే ఇపుడు మళ్ళీ పోలింగ్ బూతుల ముందుకు మరో మారు పోలోమని ఓటర్లు పరుగులు పెట్టాలన్న మాట. కొత్త సర్కార్ ఏర్పాటు ఎవరో ఏమిటో  తెల్సిన తరువాతే ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వార్ వన్ సైడే అని కూడా అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: