జగన్ ఇపుడు హిందు ధర్మాన్ని, పద్ధతులను బాగా అనుసరిస్తున్నారు. అందుకు పాదయాత్ర  ఆరంభం, ముగింపు రెండూ కూడా తిరుమల దేవదేవుని ఆశీస్సులతో చేశారు. ఇక ఆయన స్వామిజీలను కూడా బాగా నమ్ముతున్నారు. వారి సలహా సూచనలతోనే ఎన్నికల ప్రచారం కానీ, అభ్యర్ధుల విడుదల కానీ అన్నీ చేశారు.


ఇక ఇపుడు జగన్ ముందు మరో విషయం ఉంది. అదే రేపు ఎన్నికల్లో గెలవడం, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జగన్ రేపటి రోజున సీఎం అవడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. మే 23న ఫలితాలు వచ్చాక జగన్ అతి కొద్ది రోజుల వ్యవధిలోనే మంచి ముహూర్తం ఎంచుకుని ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తం, మంత్రుల సంఖ్య వంటివి కూడా విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి నిర్ణయించి ఉంచారని అంటున్నారు.


జగన్ తనతో పాటు తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారుట. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేల  మంత్రివర్గం  కూర్పు ఉంటుందని కూడా అంటున్నారు. శ్రీకాకుళం  నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, ఇక గుంటూరు నుంచి మోపిదేవి వెంకట రమణ, ప్రకాశం నుంచి బాలినేని  శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్, చిత్తూరు నుంచి ఆర్ కే రోజా, కర్నూల్ నుంచి బాలా నాగిరెడ్డి, కడప నుంచి  అంజాద్ భాషా, క్రిష్ణా జిల్లా నుంచి కొడాలి నాని ఇలా జగన్ తొలి క్యాబినెట్ ఎంపిక చేశారని న్యూస్ వస్తోంది. చూదాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: