పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తాడన్నదానిపై చర్చ ఓ వైపు జరుగుతూనే ఉంది. పది అని ఒకరు.. ఇరవై అని మరొకరు.. కాదు నలభై అని అభిమానులు ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. 


ఇక ఆ పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణ అయితే ఏకంగా 88 అని చెప్పేశారు. ఇవన్నీ ఇలా ఉంటే.. పవన్ అసలు లక్ష్యం మాత్రం ఇవేమీ కాదట. ఆయన లక్ష్యం 125 సీట్లు.. అదేంటి.. అంత సీన్ ఉందా.. అని ఆశ్చర్యపోకండి.

ఈ లక్ష్యం మాత్రం ఇప్పటికి కాదట.. 2024 సంవత్సరానికట. ఈ ఎన్నికల్లో అసెంబ్లీలోకి, పార్లమెంట్‌లోకి వెళ్లడమే టార్గెట్. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లు విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నదే. 

ఇలా చేయడం ద్వారా 2024 ఎన్నికలకు జీరో బడ్జెట్ రాజకీయంతో పవర్‌లోకి రావాలన్నది పవన్ లక్ష్యంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కొందరు కుర్రాళ్లకు వివరించి చెప్పారట కూడా. ఇదే నిజమైతే.. పవన్ రాజకీయాన్ని మనసారా ఆహ్వానించాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: