ఏపీ ప్రతిపక్షనేతకు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో విలాసవంతమైన భవనం ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఇందులో 70 పడకగదులు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీ కార్యాలయంలోపాటు.. ఎన్నో ఆఫీసులు నిర్వహించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. 


అయితే ఈ లోటస్ పాండ్ నివాసంలో ప్రదానమైన హాలులో.. జగన్ నేతలను కలిసే హాల్‌లో ఓ కొటేషన్ ఉందట. అదేంటంటే... దేవుడు నీ వైపే ఉన్నాడు.. ముందుకు సాగిపో.. అనే బైబిల్ వాక్యం ఉందట. ఈ విషయాన్ని తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులు వెల్లడించారు. 

ఇటీవల మోత్కుపల్లి నరసింహులు జగన్‌ ను ఆయన నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. ఆ వివరాలను ప్రస్తావిస్తూ.. మోత్కుపల్లి ఈ కొటేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఆ వాక్యం జగన్ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని.. దేవుడు జగన్‌తో ఉన్నాడు కనుకే ఆయన అంతగా పోరాడుతున్నారని కితాబిచ్చారు.  

నిజమే.. ఈ వాక్యం సంగతి ఏమో కానీ.. జగన్ బహిరంగంంగానే తన దైవభక్తి చాటుకుంటుంటారు. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు చూస్తున్నాడు.. దేవుడి దయ ఉంటే.. అంటూ తరచూ మాట్లాడుతుంటుంటారు. మరి నిజంగా దేవుడు ఆయన జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాడో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: