వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఇప్పటికే వైసీపీ పార్టీ , జగన్ పూర్తి ధీమాతో ఉన్నారు. దీనితో ఇప్పటి నుంచే మంత్రి పదవుల వ్యవహారం షురూ అయ్యిందని మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక ఆసక్తి కరమైన చర్చ నడుస్తుంది. ఇక వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్న అధినేత జగన్ ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలో గెలుపు గుర్రాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.


సామాజకి ఈక్వేషన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుని బెస్ట్ కేబినెట్ తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేతలు లోటస్‌పాండ్‌కు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లోటస్ పాండ్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే స్పీకర్‌గా ఎవరుంటారన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి స్పీకర్ పదవికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది.


ఒకప్పుడు అసెంబ్లీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖం కనిపించకూడదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యూహంలో భాగంగానే దగ్గుబాటికి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. దగ్గుబాటికి స్పీకర్ పదవి ఇస్తే ఇక చంద్రబాబు అధ్యక్ష అని పిలువక తప్పదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి అదే సమయంలో చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: