ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని శతవిధాలుగా పోరాడిన తెలుగుదేశం పార్టీ పోస్ట్ పోల్ సర్వేలు కూడా ముమ్మరంగా చేయిస్తోంది. పరిస్థితి తమకు అనుకూలమేనని బయటకు చెబుతున్నా ఎక్కడో తెలియని బెంగ భయం ఆ పార్టీని పట్టి పీడిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఆ పార్టీ నేతలు తలో విధంగా చెబుతున్న మెజారిటీ నంబర్లే.


ఇక ఇలా కాదనుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చెసిన ఎమ్మెల్యే అభ్యర్ధులతో కీలక‌మైన మీటింగ్ రేపు అమరావతి వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కి  మండే మీట్ అని పేరు కూడా తమ్ముళ్ళు అపుడే పెట్టేశారు. అంటే అంతలా మండించే  విధంగా ఈ మీటింగ్ ఉంటుందని టాక్. ఈ మీటింగ్ లో వాడి వేడిగా గెలుపు విషయంలో మధింపు ఉంటుందని  తెలుస్తోంది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న సర్వేలను తెప్పించుకుని అధ్యయ‌నం  చేసిన చంద్రబాబు ఎమ్మెల్యే అభ్న్యర్ధుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలుస్తోంది.


వారి వద్ద సమాచారంతో సరిపోల్చుకుని  టోటల్ గా గెలుపుపై  ఓ నిర్ణయానికి వస్తారని అంటున్నారు. అదే విధంగా వివిధ సామాజిక వర్గాలు ఓటింగు ఎలా జరిగింది. ప్రభుత్వ పధకాల పట్ల వారు ఎలా రెస్పాండ్ అయ్యారన్న దాని మీద కూడా ఈ మీటింగులో లోతైన చర్చ సాగుతుందని టాక్. మొత్తానికి చూస్తే రేపటి మీటింగ్ తరువాత టీడీపీ గెలుపు మీద ఓ అంచనాకు వస్తుందని. అదే ఫైనల్ అవుతుందని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: