నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు మెతుకుమిల్లి శ్రీభరత్  తాజా ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి టిడిపి తరపున ఎంపీగా పోటీ చేశారు, శ్రీ భర‌త్ దివంగత సీనియర్ నేత ఎంవివిఎస్. మూర్తి కొద్ది రోజుల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు విశాఖ తెలుగుదేశానికి పెద్దదిక్కుగా ఉన్న మూర్తి 1999లో ఇక్కడ నుంచి గెలిచారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మూర్తి ఏకంగా మూడు ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు.  గత ఎన్నికల్లో టిడిపి విశాఖ సీటును పొత్తులో భాగంగా బిజెపికి వదులుకోవడంతో అక్కడి నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కంభంపాటి హరిబాబు విజయం సాధించారు. ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ నుంచి ఎంపీగా ఎవరిని రంగంలోకి దింపాలన్న దానిపై ఎన్నికలకు ముందు పెద్ద త‌ర్జ‌నభ‌ర్జ‌న‌లే నడిచాయి. రాజకీయంగా  పలువురు నేతల వారసులు ముందు ఉండడంతో భరత్ సైతం తాను కూడా విశాఖ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నాడు. 

Image result for sri bharat images in hd politics

అయితే అప్పటికే నందమూరి, నారా ఫ్యామిలీ నుంచి చంద్రబాబు బాలయ్య , లోకేష్ పోటీలో ఉండడంతో చంద్రబాబు భరత్‌కు సీటు ఇచ్చేందుకు ఇష్టపడ‌ లేదన్నది వాస్తవం. భరత్ కోసం బాల‌య్యతో పాటు భ‌ర‌త్ భార్య తేజస్విని నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు రావడంతో చంద్రబాబు తలొగ్గక తప్పలేదు. భరత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాల్సిందే అని పట్టుబట్టడంతో పాటు తన మరో తాత కావూరి సాంబశివరావు ద్వారా కూడా లాబీయింగ్ చేయడంతో ఎట్టకేలకు బాబు భరత్ కు విశాఖ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇంకా చెప్పాలంటే శ్రీ భరత్ కు అభ్యర్థిత్వం ఖ‌రారు కాకుండానే  తన‌కు అభ్యర్థిత్వం వస్తుందో ?రాదో అన్న సందేహంతో ఉన్న ఆయన అప్పటికే రంగంలోకి దిగి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని మీడియాకు కొన్ని ఇంటర్వ్యూలు కూడా విడుదల చేశాడు. భరత్ హెచ్చరిక ధోరణితో మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకున్న చంద్రబాబు చివరకు ఆయనకు ఎంపీ సీటు ఇచ్చారు. 


అంతకుముందు విశాఖ ఎంపీ సీటు విషయంలో టిడిపిలోలో మరో విధమైన చర్చ నడిచింది. విశాఖ ఎంపీగా గాజువాక సెట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు లేదా మంత్రి గంటా శ్రీనివాసరావులలో ఎవరో ఒకరిని పోటీ చేయించాలని చంద్రబాబు అనుకున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌ను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు స్కెచ్ గీశారు. చివరకు ఈ ప్లాన్‌కు భరత్‌కు అడ్డురావడంతో భీమిలి నుంచి పోటీ చేస్తాడని అనుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీని వెనుక కూడా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు బోగట్టా. విశాఖ ఎంపీ సీట్ల పరిధిలో ఎమ్మెల్యే ఓట్లు మాత్రం టిడిపి అభ్యర్థులకు వేయించి, ఎంపీ ఓట్లు టీడీపీకి వేసేలా టిడిపి అధిష్ఠానం నుంచి డైరెక్షన్ నడిచిందని విశాఖ మొత్తం ఓపెన్ టాక్ నడుస్తోంది.  


దీనిని బట్టి శ్రీ భరత్ కు టికెట్ ఇప్పించింది చంద్రబాబు... ఆయన ఓటమికి తెరవెనక స్కెచ్ చేసింది చంద్రబాబే అన్నది టిడిపిలోనే కొన్ని వర్గాల ద్వారా విశాఖలో వినిపిస్తున్న టాక్. ఎన్నికలు ముగిశాక శ్రీ భరత్‌కు సైతం విషయం అర్థం కావడంతో పాటు తాను ఓడిపోతున్నాను అన్న విషయం తేలిపోవడంతో ఎన్నికల  ఫలితాల తర్వాత భరత్ పెద్ద ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. విశాఖ ఎంపీ ఫలితం దాదాపు భారత్‌కు వ్యతిరేకంగా ఉంటుందని తెలిపోవ‌డంతో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఇటు నారా ఫ్యామిలీ అటు నందమూరి ఫ్యామిలీ మధ్యలో భరత్ రగడ మామూలుగా ఉండేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: