జేడీ..ఈసారి ఎన్నికల్లో ఈ పేరు మారుమోగింది. విశాఖ నుంచి చివరి నిముషంలో జనసేన ఎంపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేశారు. పవన్ సంగతేమో కానీ ఆ పార్టీలో ఇపుడు ఎక్కువగా వినిపించే పేరు జేడీదే. మరి జేడీ కూడా పోలింగ్ అయ్యాక బాగా యాక్టివ్ అవుతున్నారు. పొలిటికల్ గా ఆయన దూకుడు పెంచుతున్నారు. తాను సీబీఐలో పదవికి రాజీనామా  చేసి రాజకీయాల్లొకి రావడం  కరెక్ట్ డెసిషన్ అని కూడా జేడీ అంటున్నారు.


ఇవన్నీ ఇలా  ఉంటే జేడీ లేటెస్ట్ గా  కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని, 88 సీట్లు గెలుచుకుంటామని గట్టిగా చెప్పారు. దీని మీద వైసీపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటరేశారు. పోటీ చేసింది 65 సీట్లకైతే 88 ఎలా వస్తాయి జేడీ గారు అంటో  సెటైర్లు వేశారు. దీనికి జేడీ కూడా గట్టి రిటార్టే ఇచ్చారు. మేము మొత్తం 145 సీట్లకు సొంతంగా పోటీ చేశామని, సీఏ చదివిన సాయిరెడ్డి కు తప్పుడు లెక్కలు తప్ప అసలు లెక్కలు రావు అంటూ గట్టిగా ఇచ్చుకున్నారు.


ఇపుడు సాయిరెడ్డి వంతు వచ్చింది. ఆయన అలా  ఇలా కాకుండా మొత్తంగా జాడించేశారు. జేడీ గారు మీకు గ్లాస్ పార్టీలో ఉన్న ప్లేస్ ఏంటో నాకు తెలియదు అంటూ మొదలుపెట్టి మీరు 145 సీట్లకు పోటీ చేసినా 80 బీ ఫారాలు బాబు వద్దనే మీ నాయకుడు ఉంచేశాడని, ఆ విధంగా త్యాగం చేసిన మీదట పోటీ చేసినవి 65. ఇపుడు లెక్క సరిపోయిందా అంటూ సెటైర్లు వేశారు. ఇక చీకటి పొత్తులు పెట్టుకుని జనాలని వెర్రి పుష్పాలు చేయడానికి మీ నాయకుడు పవన్, చంద్రబాబు ఆడిన డ్రామాకు జనం దిమ్మతిరిగే తీర్పు చెప్పబోతున్నారంటూ రిటార్ట్ ఇచ్చారు.


ఇక మీరు ఎప్పటికీ జేడీనే. ఎందుకంటే నేరాల పార్టీ (టీడీపీ), విలువలు లేని పార్టీ ( జనసేన‌) ల రెండింటికీ జాయింట్ డైరెక్టర్ తమరే కదా అంటూ  సాయిరెడ్డి పంచ్ పేల్చారు. మీరు మొదట టీడీపీ నుంచి భీమిలీకి పోటీ చేయాలనుకోలేదా. అలాగే జనసేనకు చివరి నిముషంలో ఎవరి ఆదేశానుసారం  చేరారో అందరికీ తెలుసంటూ కూడా బాంబు పేల్చారు. ఇక బాలయ్య అల్లుడికి అక్కడ వెన్నుపోటు పొడిచి మీకు మద్దతు ఇవ్వమని తండ్రీ కొడుకులు చెప్పలేదా. ఇది నిజం కాదా అంటూ సూటిగానే నిలదీశారు. మొత్తానికి జేడీ ఒక కౌంటర్ కి మొత్తం విషయాలన్నీ గటగటమంటూ సాయిరెడ్డి చెప్పేయడంతో ఇపుడు జేడీ రియాక్షన్ ఏంటా అని అంతా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: