ఐటీ గ్రిడ్స్ వ్య‌వ‌హారంపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ, తెలంగాణ, పంజాబ్‌కు చెందిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిన ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఉన్నారన్నారు. దొంగలను దగ్గర పెట్టుకున్న చంద్రబాబు రోజు అవినీతిపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటాతో పాటు పంజాబ్‌కు చెందిన పౌరుల డేటాను చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ జైల్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. 


లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశంలో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ ఐటీగ్రిడ్స్ డేటా కేసు తీగలాగితే డొంకంతా కదులుతోందన్నారు. మే 23 తర్వాత ఐటీగ్రిడ్స్ డేటా దొంగలంతా కటకటాల వెనక్కే అని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఐఎస్‌ఐ గూఢచారి సంస్థ కంటే ఐటీగ్రిడ్స్ సంస్థ ప్రమాదకరమని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని అన్నారు.  ఆపద్ధర్మ‌ సీఎం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని కోట్ల రూపాయలు విడుదల చేయడం చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కోట్లలో బల్లులు చెల్లింపులు చేస్తున్న అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ఆయన గుర్తు చేశారు. ఇటీవల ఏపీ సీఎస్ అనిల్ పునీఠా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నందున ఆయన్ని ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందన్నారు.తక్షణం ఏపీ చంద్రబాబును కట్టడి చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కోడ్ ఉల్లంఘనలో భాగంగా అధికారులను బదిలీ చేయడమేనని ఆయన  ఆరోపించారు. 


పీ సీఎంకు అనుకూలంగా ఉన్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీల సిబ్బందిని పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ అడ్డుకుందని, దీంతో తాను ఓటమి చెందుతున్న విషయం చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు. ఏపీ ప్రజల తీర్పు బాబుకు వ్యతిరేకంగా ఉండడంతో ఈవీఎంలను బదనాం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు వ్యవహార శౌలిపై ఎలా ఉంటుందో చెబుతూ ‘కూట్లో రాయిని తీయలేనినోడు ఏట్లో రాయి తీయడానికి వెళ్ళాడట’ అంటూ చురకులు అంటించారు. జనసేన పార్టీ నుంచి విశాఖపట్నంలో పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ అప్పుడూ ఇప్పుడూ జేడీగా ఉన్నారని, ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీలకు జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తన్నారని ఆయన గుర్తు చేశారు. మూడు నెలల్లో మూడు పార్టీలు లోక్‌సత్తా. టీడీపీ, జనసేన పార్టీలు మార్చిన జేడీ భవిషత్‌లో ఎన్ని పార్టీలు మారుతారోనని ఆయన చమత్కరించారు. చంద్రబాబు దగ్గర జేడీ లక్ష్మీనారాయణ ట్యూషన్ చెప్పించుకుంటే మంచిదని విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: