పాపం .. లోకేష్ నోరు తెలిస్తే బుక్ అవుతూనే ఉంటాడు. ఎన్నికల అయిన చాలా రోజుల తరువాత లోకేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారని, ఈసీ సీరియస్ అవ్వడంపై లోకేష్ రుసరుసలాడుతున్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు, సమావేశాలు పెట్టుకుంటే ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శిస్తున్నారు. తెలంగాణలో వర్తించని కోడ్, ఏపీలో ఎందుకు వర్తిస్తుంది, ఏంటీ పక్షపాతం అని ఆవేదన వ్యక్తంచేశారు.


కోడ్ సంగతి పక్కనపెడితే, ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రెండోసారి అధికార పీఠం కైవసం చేసుకున్నారు కేసీఆర్. ఆయన అక్కడ పూర్తికాల ముఖ్యమంత్రి. అక్కడ కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఏపీ పరిస్థితి వేరు, ఫలితాలకింకా సమయం ఉంది. అప్పటివరకూ ముఖ్యమంత్రికి నామమాత్రపు అధికారాలే ఉంటాయి. రేపు అధికార మార్పిడి జరిగితే.. ఈ నెలరోజుల్లో తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు కొత్త సర్కారు ఎలా బాధ్యత వహిస్తుంది.


తెలంగాణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఫలితాల తర్వాత అక్కడ ప్రభుత్వం మారదు కాబట్టి అవన్నీ చెల్లుబాటు అవుతాయి. కోడ్ విషయంలో తెలంగాణకు, ఏపీకి చాలాతేడా ఉంది. అందుకే సమీక్షలు, సమావేశాలు జరుపుకోవాలంటే ఏపీలో కచ్చితంగా ఈసీ అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు సమీక్షలతో అధికారులకు చిక్కులు తెచ్చిపెట్టారు. అయితే ఇప్పుడు చినబాబు తెలంగాణ సర్కారుపై పడి ఏడవడాన్ని ఏమనుకోవాలి. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. లోకేష్ పై సెటైర్లు పేలుతున్నాయి. లోకేష్ ట్వీట్లకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: