చంద్రబాబు ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం గా కొనసాగుతున్నారు. పూర్తి స్థాయి సీఎం కు ఉండే అధికారాలు ఇప్పుడు బాబు గారికి లేవని చెప్పాలి. అయితే  గడిచిన 3 వారాల్లో ఏకంగా 18 రహస్య జీవోల్ని జారీచేశారు చంద్రబాబు. వీటిలో సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖలకు చెందిన జీవోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, ఆర్థిక, హోంశాఖ రంగాలకు చెందిన జీవోల్లో ఎక్కువగా గోప్యత పాటిస్తారు.


ఇది అవసరం కూడా. కానీ సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖలకు చెందిన జీవోల్లో గోప్యత ఏముంటుంది? ఇది ప్రజలకు సంబంధించిన అంశం కదా! ఈ జీవోల్లో గోప్యత ఎందుకు? ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు చంద్రబాబు. ఈ నాలుగున్నరేళ్లలో తను చేసిన అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఇలా కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దీనిపై వైసీపీ కూడా స్పందించింది. ఆ చీకటి జీవోల గుట్టు రట్టుచేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు పాస్ చేసిన రహస్య జీవోల్ని బహిర్గతం చేస్తామని అంటోంది.


కానీ వైసీపీ చెబుతున్నట్టు ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 15 నెలలకే 845 రహస్య జీవోలు పాస్ చేశారు చంద్రబాబు. ఈ లెక్కన ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని వేల చీకటి జీవోలు పాస్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి సరిదిద్దడం సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే, వాటిలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఉండొచ్చు. ప్రభుత్వ ఖజానా నుంచి వందల కోట్ల డబ్బు ఇతర ఖాతాల్లోకి వెళ్లి ఉండొచ్చు. అధికారికంగా జరిగిన ఆ లావాదేవీల్ని మళ్లీ పునరుద్ధరించడం అసాధ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: