శనివారం రామోజీరావు గారి మనవరాలి పెళ్లి వైభవోపేతంగా జరిగింది. రామోజీరావు గారు అంటే మాటలా మరి.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ చక్రం తిప్పగలిగినంత పలుకుబడి ఉన్న ప్రముఖుడు. ఈనాడు పత్రికతోపాటు ఆయన వ్యాపారాలు ఎన్నో. 


ఆయన మనవరాలి పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ వచ్చారు. అన్ని పార్టీల నేతలూ వచ్చారు. పారిశ్రామిక వేత్తలు, సినీరంగప్రముఖులూ వచ్చారు. 

కానీ ఒకే ఒక్క వీ వీఐపీ మాత్రం రాలేదు. ఆయనే జగన్. ఆయన తండ్రి వైఎస్‌ హయాం నుంచి రామోజీగారితో కయ్యం ఉండేది. అదే వైరం సాక్షి పత్రిక పెట్టిన మొదట్లోనూ ఉంది. ఆ తరవాత కొన్నాళ్లకు జగనే రామోజీరావుగారి చెంతకు వచ్చి స్నేహహస్తం చాచారు.

అప్పటి నుంచి బాగానే ఉన్న సంబంధాలు మొన్నటి ఎన్నికల ముందు మళ్లీ చెడ్డాయి. ఎన్నికల సమయంలో రామోజీ మీడియాను ఎల్లో మీడియా జాబితాలో కలిపేసి జగన్ చాలాసార్లు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్ని ఉన్నా.. ఇలాంటి శుభకార్యాలప్పుడు కలవడం మామూలే. మనసులో ఏమి ఉన్నా.. మర్యాదపూర్వకంగా వస్తుంటారు. కానీ జగన్ మాత్రం ఆ మర్యాద పాటించలేదు. దీన్నిబట్టి రామోజీరావుగారిపై జగన్ కు కోపం తగ్గలేదని అనుకోవచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: