ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర సీఎస్‌ సుబ్రహ్మణ్యంపై సదభిప్రాయం లేదు. ఆయన్ను సీఎస్‌గా ఈసీ నియమించాక కూడా ఎల్వీ జగన్ కేసులో సహనిందితుడని చంద్రబాబు కామెంట్ చేశారు. ఎల్వీ జగన్‌ కేసులో నిందితుడన్న మాట నిజమే కానీ..అసలు జరిగిందేంటి..?

వైఎస్ హయాంలో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను సుబ్రహ్మణ్యం అమలు చేశారు. కేబినెట్ చెప్పాక అమలు చేయకుండా ఎలా ఉంటారు. దాన్ని సీబీఐ తప్పుబడుతూ సహనిందితుడుగా చేర్చింది. ఆయన కోర్టుకెళ్లారు. కోర్టు కేసు కొట్టేసింది. 

అయినా చంద్రబాబు మాత్రం సీఎస్‌ను పట్టుకుని జగన్ సహనిందితుడని అంటారు. కానీ ఆయన్ను అలా అనుకూడదంటూ మాజీ ఐఏఎస్‌లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంమాత్రం దారుణం అన్నట్టు చంద్రజ్యోతి పత్రికగా జనం చెప్పుకునే పత్రిక రాసుకొచ్చింది. 

అంతే కాదు.. మాజీ ఐఏఎస్‌లను పనీపాటాలేని వాళ్లు అని పేర్కొనడం ద్వారా వారిని అమానపరిచింది. పనీపాటా లేకుండా కూర్చున్న వాళ్లందరూ ఆంధ్రప్రదేశ్‌పై పడి రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటివారి చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేక శక్తులకు సహకరించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తున్నారు.. అంటూ ఆ పత్రిక రాసింది. అవును మరి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏం చేసినా అది ఏపీకి ద్రోహం చేసినట్టే.. రాష్ట్రప్రయోజనాలకు హాని చేసినట్టే.. అంతేగా.. అంతేగా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: