చదువుకోక ముందు ‘కాకరకాయ’ అనేవారు, చదువు తర్వాత ‘కీకరగాయ’ అన్నారట. చదువు సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో గుణాత్మక మార్పురావాలి. ఏది మంచో ఏది చెడో, గ్రహించే విచక్షణతో పాటు సంస్కారం సంస్కృతి సాంప్రదాయం అందించే విలువలు ఈ చదువుతో పాటు పెంపొందాలి. అందుకు విద్యాబోధనే కాదు ఆ పరిసరాలు కూడా దోహదపడాలి. గత 13 న విశాఖ నగరంలో రిషికొండ లోని విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ పేరు తో తాను నిర్వహిస్తున్న క్లబ్‌లో మందు పార్టీకి అనుమతి  తీసుకొని డ్రగ్స్ తీసుకొని యువత చేసిన అల్లరి అంతా ఇంతాకాదు. కొన్ని నగరాల్లో ఆడ,మగ తేడా లేకుండాపోయింది.


గ్లోబ‌లైజేష‌న్ పుణ్యమా అని హైటెక్ సిటీకి కల్చర్‌లో ఊహించ‌ని మార్పుల చోటు చేసుకుంటున్నాయి. ఉపాధి అవ‌కాశాలు పెరిగాయి. సంపాద‌న మార్గాలు క్రియేట్ అయ్యాయి. దీంతో సిటీ లైఫ్ స్టైల్ మారిపోయింది. న‌గ‌రంలో పార్టీ క‌ల్చ‌ర్ కామ‌న్ అయిపోంది. ప‌బ్ క్ల‌బ్ క‌ల్చ‌ర్ తో పాటు రేవ్ పార్టీలు కామన్‌గా మారాయి. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు, పబ్బులు, క్ల‌బ్బులు జ‌నంతో కిట‌కిట‌లాడు తున్నాయి.

Image result for visakha rev partyఒక‌ప్పుడు పార్టీ అంటే ఏ విస్కీయో, బ్రాందీయో తాగేవారు. కానీ ఇప్పుడు మాత్రం మ‌త్తులో జోగు తున్నారు కుర్ర‌కారు. న‌షా నిషాలో తూగు తున్నారు. దీనికి తోడు కొత్త‌ రుచులు చూడాల‌న్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో డ్రగ్స్, మద్యం తర్వాత ఇక తర్వాత పీక్ స్టేజ్‌కు చేరుతున్నాయి పార్టీలు. అందమైన అమ్మాయిల్ని బుక్ చేసుకొని, పార్టీలో వారి చేత అర్థనగ్నంగా, నగ్నంగా డ్యాన్సులు చేయిస్తూ మత్తులో జోగుతున్నారు.


ఎలా జరుగుతుందంటే: పార్టీ సందర్భంగా మ్యూజిక్ నడుస్తుంది. ఆ మ్యూజిక్ కిరాకు పుట్టించే సౌండ్ తో భారీగా సాగుతుంది. కళ్లు చెదిరేలా అందమైన అమ్మాయిలు మ్యూజిక్‌కు తగినట్లుగా సెక్సీ మూవ్మెంట్స్ ఇస్తూ రెచ్చగొట్టె డాన్స్ చేస్తుంటారు. చాలావరకు రేవ్ పార్టీలో అమ్మాయిలు అర్థ నగ్నంగా డాన్సులు చేస్తుంటారు. దీంతో వారిని చూసి పార్టీకి వచ్చినవారంతా ఎంజాయ్ చేస్తుంటారు. కాస్త హుషారుగాళ్లు అయితే అమ్మాయిలపై కరెన్సీ నోట్లను విసురుతూ సంతోషిస్తుంటారు. అదే సమయంలో ఆ పార్టీలో మద్యం కూడా విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. అంతటితో రేవ్ పార్టీ ఆగదు అదే మత్తులో ఇదే ఊపులో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు సైతం గుట్టుగా ఓవైపు జరిగిపోతుంటాయి.

Image result for visakha rev party

విశాఖ నగరంలో రంకెలేసిన రేవ్‌ పార్టీ సూత్రధారులను వదిలేసిన పోలీసులు ప్రస్తుతానికి పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసిన నిందితులను మాత్రమే అరెస్టు చేసే పనిలో ఉన్నారు.విశాఖ నగర ప్రతిష్టను మంటగలిపే విధంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీకి.. మందు పార్టీ పేరిట అనుమతులు తీసుకున్న రాజకీయ నేతల జోలికి పోని ఖాకీలు డ్రగ్స్‌ పంపిణీ చేసిన బ్యాచ్‌ను మాత్రం జల్లెడపడుతున్నారు.

rev parties in goa కోసం చిత్ర ఫలితం

సదరు రేవ్‌ పార్టీకి ఇద్దరు మంత్రుల ఒక మాజీమంత్రి కుమారులు, నగరానికి చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కొడుకు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. అసలు వీరి కోసమే అట్టహాసంగా ఆ పార్టీ పెట్టారనేది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఈ కోణం వైపు కన్నెత్తి చూడని పోలీసులు డ్రగ్స్‌ మాఫియా పనిపడతా మంటూ బీరాలు పోతున్నారు. మరోవైపు వెనుకా ముందూ ఆలోచించకుండా రేవ్‌ పార్టీకి అడ్డ గోలు అనుమతులు ఇచ్చేసిన ఎక్సైజ్‌ అధికారులు ఒక్కొక్కరుగా బలవు తున్నారు.

Image result for visakha rev party

సెలవు రోజైన ఈనెల 13న అర్ధంతరంగా మందు పార్టీకి అనుమతిలిచ్చిన గాజువాక ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బి.సుబ్బారావు బుధవారం నుంచి దీర్ఘకాల సెలవులోకి వెళ్లిపోగా ఆ బాధ్యతను మరో అధికారి దాస్‌కు అప్పగించారు. ఈ వ్యవ హారంలో ఎక్సైజ్‌ అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇంకా ఎవరిపై వేటు పడనుందనే భయం ఆ వర్గాలను వెంటాడుతోంది.


ఆ పార్టీకి మాదకద్రవ్యాలు సరఫరా చేసిన మల్లిపెద్ది సాయి రాఘవ చౌదరి అలియాస్‌ సోను ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సోను ద్వారానే నగరంలోని చాలామందికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మేరకు అతన్ని రహస్య వ్రదేశంలో విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెట్రో నగరాల్లో నూ కాస్మో సిటీస్ నగర శివారుల్లో ఎక్కువగా రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారు. మొదట ముజ్రాగా మొదలైన ఈ పార్టీలు తర్వాత రేవ్ పార్టీలుగా మారాయి. ఇందులో ఒక అడుగు ముందుకేసి డ్రగ్స్ ను వినియోగించటం షురూ చేశారు. ఒకవైపు అమ్మాయ్ మరోవైపు మందు మరింత కిక్ కావాలంటే డ్రగ్స్ అన్నట్లుగా సాగుతుంది రేవ్ పార్టీ.

Image result for visakha rev party

ఈ మధ్య రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. నగరాల్లో వీక్ ఎండ్ వస్తే చాలు కుర్రకారు ఎక్కడో అక్కడ రేవ్ పార్టీల్లో ఎంజాయ్ మెంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. పాశ్చత్య సంస్కృతి అయిన ఈ రేవ్ కల్చర్ మన భారత దేశంలో యువతను పెడద్రోవ పట్టిస్తుంది. గతంలో చాలాసార్లు హైదరాబాద్ శివారుల్లో రేవ్ పార్టీలు జరిగాయి. వాటిపై పోలీసులు కూడా నిఘా పెంచారు. చాలామందిని అరెస్టులు కూడా చేశారు. విశాఖ, విజయవాడలో కూడా రేవ్ పార్టీలో జరిగిన సందర్భాలున్నాయి.


ఇక ఈ రేవ్ పార్టీల కల్చర్ పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో ఈ కేసుకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. రేవ్ పార్టీలో అసభ్యకర నృత్యాలే కాదు డ్రగ్స్ వినియోగం జోరుగా సాగుతున్నట్టు గుర్తించారు. కోడ్‌ లాంగ్వేజ్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఆన్‌లైన్‌లోనూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ సరఫరా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ వీర రాఘవ అలియాస్‌ సోను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు సోను కోసం గాలింపు చేపట్టారు.ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌ మాఫియాతో సోనుకు సంబంధాలున్నట్టు విచారణలో తేల్చారు.

Image result for visakha rev party

అయితే పార్టీలో మద్యంతో పాటు గోవా నుంచి తీసుకువచ్చిన ఎల్‌ఎస్‌డీ స్టిక్కర్లు, ఎండీఎంఏ పౌడరులాంటి అత్యంత మత్తుకలిగించే మాదకద్రవ్యాలను (నార్కోటిక్స్) అందుబాటులో ఉంచారు. అంతేకాక అనుమతి పొందిన సమయందాటి విపరీతంగా డీజే-సౌండ్స్‌తో పార్టీ నిర్వహించారు. హోరెత్తి పోయే శబ్దాలతో అసభ్యకర నృత్యాలతో రెచ్చిపోయిన యువతపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించేసినట్టు సమాచారం.


భారత సంస్కృతికి సవాల్ విసురుతున్న పాశ్ఛాత్య విష సంస్కృతి: రాజకీయాల అండతో విలయం సృష్టిస్తు విస్తరిస్తున్న డ్రగ్ విషవలయం 


గతంలో రాజులు తమ కుమారులను విద్యాభ్యాసం కోసం ఆశ్రమాలకు పంపేవారు. ఇతర విద్యార్థులతో పాటు వారూ కలిసి మెలిసి చదువు కునేవారు. సాధ్యమైనంత వరకు రాచబిడ్డల మని, రాచరిక ప్రభావం వారి మీద పడకుండా జాగ్రత్త పడేవారు. ప్రస్తుతం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. విద్యా విధానంలో కూడా సమగ్ర మైన మార్పులు వచ్చా యి. అత్యంత ప్రతిభావంతులు ప్రభావంతులైన యువకులు అహర్నిశలు శక్తివంచన లేకుండా కృషిచేసి దేశవిదేశాల్లో గుర్తింపు తెస్తున్నారు అందులో మరోవాదనకు తావులేదు.


కానీ పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలకు మంగళం పాడుతున్నారు. పరిస్థితులను గమనిస్తే రానురాను భారతీయ సంస్కృతి అదృశ్యమై పోతుందేమో? ననే కలవరం కలగక తప్పదు. సమయం సందర్భం లేకుండా అర్థరాత్రి రోడ్లపైకి వచ్చి వెర్రిగంతులు వేయడం, కొన్ని క్లబ్‌లలో నృత్యాల పేరుతో చేసే వెకిలి చేష్టలు, వెర్రితలలు వేస్తున్న విష సంస్కృతికి పరాకాష్ట.


నగరాల్లో ఎక్కడ చూసినా వందల మంది యువతీ యువకులు కేరింతలు కొడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పేరుతో నానా హంగామా చేశారు. ‘హ్యాపీ న్యూయిర్‌ అంటూ నినాదాలు చేశారు. అసలు వారు ఎవరికి చెప్తున్నారో! వారికే తెలియదు. ఈ ఆనందకేళి లో అదుపు తప్పి ఎంత మంది గాయపడ్డారో స్పష్టంగా సమాచారం లేదు. కానీ మద్యం మత్తు లో వాహనాలు నడుపుతూ పట్టుబడిన యువతీ యువకులను గమ్యం చేర్చడానికి పోలీసులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.


ఈసారి యువతులు కూడా వందల సంఖ్యలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడటం ఆవేదన కలిగిస్తున్నది. సంవత్సరం ఆరంభం లోనే కాదు నెలలు గడచిన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పట్టుబడిన యువతీ యువకులను పోలీసులు కౌన్సిలింగ్‌ చేసి కోర్టు ముందు హాజరుపరిస్తే ఏకంగా కోర్టు మూడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు జైలు శిక్ష విధించింది. బహుశా ఇంతపెద్దఎత్తున యువతీ యువకులకు జైలు శిక్ష విధించడం ఇదే మొదటిసారి కావచ్చు.


ఇదంతా పాశ్చాత్య సంస్కృతే. ఈ ప్రభావం క్రమేణా నగరాలను దాటి కు-గ్రామాలకు సైతం పాకిపోతున్నది. గ్రామీణ జీవన స్రవంతి లో విలీనమై భాసిల్లుతున్న మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కూచిపూడి, భరత నాట్యం, జానపద కళలు, పాశ్చాత్య నాగరికత వెల్లువ, ఆధునికత ముసుగులో కనుమరుగైపోతున్నాయి. అనేక మతాలు, అంతరాల దొంతరలపై నిర్మితమైన మన కళా సంస్కృతిని కాపాడుకోలేమేమో? నని పిస్తున్నది. గతంలో జాతరులు, తిరునాళ్లు జరిగినా ఆయా ప్రాంతాలకు ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే జానపద కళలు, పురాణాలకు చెందిన హరికథలు, బుర్రకథలు, ఉగ్గుకథలు, నాటకాలు, పగటివేషాలను ఎంతో ఆహ్లాదకరంగా ప్రదర్శించేవారు. పండుగ దినాల్లో కూడా ఇలాంటి కళలతోపాటు కోలాటం, భజనలు చేస్తూ గడిపేవారు.


ప్రతి కళారూపం మనసంస్కృతికి అద్దంపట్టడమేకాక ప్రజలకు ధర్మాధర్మావివేచనను, ఆలోచలనల్లో ఉజ్జీవనం పెంచుటకు  ఉపయుక్తంగా ఉండేది. మనం వేసే ప్రతి అడుగులోనూ మన సంస్కృతి, నాగరికతలు విశిష్టత పరిమళాలు గుభాళించేవి . ప్రతి మాటలో సభ్యత, సంస్కారం తొణికిసలాడుతుండేవి. ఇప్పుడు వాటి స్థానంలో రికార్డు, డిస్కో డాన్సులు తింగిరి చిందులు ప్రత్యక్షమయ్యాయి.


వేలాది ప్రజలముందు అంగాంగ\ప్రదర్శన చేస్తున్నారు. గ్రామాలు సైతం సెక్స్‌సీమలుగా మారిపోతున్నాయి. ఏ సందర్భమైనా పండుగ, పబ్బాలు ఆఖరికి విషాద సందర్భాల్లో సైతం మద్యం వాడకాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ప్రతి ఆంగ్ల నూతన సంవత్సరం రోజున మద్యం ఏరులైపారటం సర్వ్ అసాధారణం అయి పోయింది. గుండబా, అక్రమ సారా గురించి చెప్పాల్సిన పని లేదు. వీటికి తోడు మాదక ద్రవ్యాల వ్యాపారం, వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నది. గంజాయి సాగును అడ్డుకోలేక పోతున్నారు. మరొక పక్క నేరాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది.


పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా నేరం జరిగిన తర్వాత దోషులను పట్టుకోగలుగు\తున్నారు శిక్షలు వేయించ గలుగుతున్నారే తప్ప ముందుగా నిరోధించలేక పోతున్నారు.ఇంకొక పక్క లైంగిక నేరాలు కూడా పెరిగి పోతున్నాయి. నేరాలు పెరగడానికి ఈ విషసంస్కృతి కూడా ఒక కారణమని పోలీసులు అంగీకరిస్తున్నారు. గతంలో ఈ సంస్కృతి మగవారికే పరిమితమై ఉండేది. అవి క్రమేణా యువతులు కూడా అందులో భాగస్వాములు కావడం ఆందోళన కలిగించే అంశం. మధ్య తరగతికి చెందిన యువతీయువకులు ఈ క్లబ్‌ల్లో ప్రవేశించడానికి ఆరాటపడుతున్నారు. ఇది ఒక స్టేటస్‌ సింబల్‌ గా మారిపోయింది. అందుకోసం యువత నానా అగచాట్లు పడుతున్నారు.


విలాసవంతమైన జీవన నేపథ్యంలో ఖర్చుపెరిగి వాటిని అందుకోవడానికి పెడతోవపడుతున్నారు. ఇంజినీరింగ్‌, పోస్టుగ్రాడ్యూ -యేషన్‌ చదివిన విద్యార్థులు కూడా గతంలో దొంగతనం కేసుల్లో ముఖ్యంగా చేయిన్‌-స్నాచింగ్‌లో పట్టుబడటం ఇందుకు ఉదహరించవచ్చు. ఈ విషసంస్కృతిని నియంత్రించేందుకు పాలకులు నడుంకట్టాలి. ఆ బాధ్యత అంతా ప్రభుత్వంపై వదిలకుండా స్వచ్ఛందసంస్థలు, మేధావులు ఇందులో భాగస్వాములు కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: