పోలవరం.. ఆంధ్రుల కల.. ఈ ప్రాజెక్టుక పూర్తయితే వృధాగా సముద్రంలోకలసే వందల కొద్దీ టీఎంసీల నీరు సద్వినియోగం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు నీటి కొరత తీరుతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు పెను ముప్పు ఉందా..?

అవునంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్ నరసింహారావు. పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆధ్వర్యంలోని అధ్యయన బృందం చెబుతోంది. ఈ టీమ్ ఆదివారం భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం తదితర ప్రాంతాలలో పర్యటించింది. 

పోలవరం కడితే బ్యాక్ వాటర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 120 కిలోమీటర్ల మేర ముంపుకు గురవుతుందని ఈ నిపుణులు చెబుతున్నారు. 36 లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటే భద్రాచలం వద్ద 43 అడుగుల మేర నీటి మట్టం ఎప్పుడూ ఉంటుందని అదే 50 లక్షల క్యూసెక్కులు అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. 

1986లో వచ్చిన వరదలు భద్రాచలంకు మిగిల్చిన చేదు అనుభవాలు నాటి వరద ఉధృతికి సంబంధించిన పూర్తి రికార్డులు సుప్రీం కోర్టుకు సమర్పిస్తామని నరసింహారావు అంటున్నారు. పోలవరం పూర్తయితే పారిశ్రామిక ప్రాంతాలైన సారపాక ఐటిసి అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ బిటిపిఎస్‌లకు కూడా ప్రమాదం ఉందన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: