తెలంగాణ ఇంటర్ బోర్డ్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇంటర్ మార్కుల జాబితాలో జరిగిన అవకతవకలపై అధికారులు సమాధానం చెప్పాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.  తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. గతేడాది కన్నా ఇచ్చిన తేదీ కన్నా ముందే, ఏపీతో పోటీ పడి ఫలితాలు ఇవ్వాలన్న తపనతో స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటమాడింది. దాంతో అంతా తప్పుల తడకతో ఫలితాలు బయటకు వచ్చాయి.  

రిజల్ట్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. మార్కులు, ఫలితాలు తలకిందులు కావడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, పేరెంట్స్ ఆందోళన బాట పట్టారు. పలు విద్యార్థి సంఘాలు ఇవాళ ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎందున నిరసన తెలిపాయి. కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం కాదని.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థి సంఘాల ధర్నాలతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

మరోవైపు విద్యాశాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. సబ్జెక్టులవారీగా ఉత్తీర్ణులు కానివారి సంఖ్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారుఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై రాష్ట్ర సర్కారు స్పందించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో కమిటీ నియమించినట్లు ప్రకటించారు. కమిటీ సభ్యులుగా హైదరాబాద్ బిట్స్ ఫ్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్‌ను నియమించారు. కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతో ఫలితాలపై అపోహలు ఏర్పడ్డాయని జగదీష్ రెడ్డి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: