ఏపీలో పోలింగ్ ముగిసిపోయింది. రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైస్సార్సీపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులంతా ఈరోజు చంద్రబాబును కలవబోతున్నారు. వాళ్లందరితో బాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ క్యాండిడేట్లు కూడా ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు. ఇంతకీ ఈ మీటింగ్ ఎజెండా ఏంటంటే.. తమతమ నియోజకవర్గాల్లో టీడీపీకి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని అభ్యర్థులంతా బాబుకు వివరించాలి.


బూత్ వారీగా పోలైన ఓట్లతో పాటు, అందులో ఎన్ని ఓట్లు టీడీపీకి పడ్డాయో చంద్రబాబుకు వివరించాలి. ఏఏ బూత్ లలో ఎంతమేరకు మెజారిటీ వస్తుందో కూడా చంద్రబాబుకు చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి మీటింగ్స్ లో అభ్యర్థులెవరూ తాము ఓడిపోతున్నామని చెప్పరు కదా. చివరికి వైఎస్ జగన్ పై పోటీచేసిన అభ్యర్థి కూడా టీడీపీదే గెలుపు అంటాడు. అలా సాగుతాయి ఈ మీటింగ్స్.


ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబుకు తెలుసు. బాబుకు తెలుసనే విషయం అభ్యర్థులకు తెలుసు. ఓడిపోయే అభ్యర్తి కూడా గెలుపు మనదే అంటాడు. వెరీ గుడ్, అలా ముందుకుపోదాం అంటారు బాబు. ఇలా అంతా కలిసి మరోసారి తమదే గెలుపు అంటారు. ఐదేళ్లలో పాలన ఇరగదీశాం అని డబ్బా కొట్టుకుంటారు. అనుకూల మీడియా సహాయంతో కథనాలు సిద్ధంచేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: