తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. అయితే వారిలో ప‌ది మంది ఇప్ప‌టికే కారెక్కేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గులాబీ గూటికి చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. గులాబీ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కాంగ్రెస్ తో పాటు టీడీపీకి చందిన ప‌లువురు నేత‌లు గులాబీ కండువా క‌ప్పుకున్నారు. మ‌రికొంత మంది కాంగ్రెస్ నేత‌లు బీజేపీలో చేరారు.

ఇక ఇప్పుడు మిగిలున్న కొంత‌మంది నేత‌ల్ని కూడా త‌మ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధికార పార్టీ రెడీగా ఉంది. ఇక ఇదే టైమ్‌లో అధికార పార్టీలోకి కాంగ్రెస్ సీఎల్పీ విలీనానికి సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించ‌గా వారిలో ప‌ది మంది ఇప్ప‌టికే గులాబీ గూటికి చేరారు. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేందుకు త‌మ ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. 


ఈ నేప‌థ్యంలో ఇలా జ‌రిగితే తెలంగాణ‌లో త‌న ప్ర‌తిప‌క్ష హోదాను కాంగ్రెస్ కోల్పోతుంది. దీంతో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంత‌కాల‌తో కూడిన 
విలీన లేఖ‌ను స్పీక‌ర్‌కు అంద‌జేసేందుకు సిద్దమ‌వుతున్న‌ట్లు స‌మాచారం. జూన్ ఫ‌స్ట్ వీక్‌లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ లోపే స్పీక‌ర్‌కు త‌మ లేఖను ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: