దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తున్న వేళ పార్టీ అధినేతలు ఒకరిపై ఒకరు దూషనల పర్వానికి తెరలేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యందా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపి మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరుగుతున్న విషయం జగమెరిగిన సత్యం.  ఈ రెండు పార్టీ అధినేతలు ఎవరి శక్తి మేరకు వారు ప్రచారాలు చేస్తూ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ప్రజలకు విన్నవిస్తున్నారు.  అయితే అధికార పార్టీ ఎన్డీయే ఈ ఐదేళ్లలో తమ పరిపాలనలో పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు, గృహిణులకు ఎంతో మేలు చేశామని.. ఈసారి అధికారంలోకి వస్తే మరింత దేశాన్ని అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్తామని చెప్పారు..ఒక దశంలో ప్రజలకు ఎల్లవేలలా కాపలాదారుగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 

అంతే కాదు ప్రస్తుతం బీజేపీ నేతలు తమ పేరు ముందు చౌకీదార్ అని పెడుతున్న విషయం తెలిసిందే.  అయితే చౌకీదార్ (కాపలాదారు) పదం పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు దొంగ’ అని అన్నారు.  దీనిపై బీజేపీ నేతలు సుప్రీం కోర్టులో దావా వేసిన విషయం తెలిసిందే.  తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు దొంగ’ అని సుప్రీంకోర్టు చెప్పినట్లు తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు.

ఈ మేరకు ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఇటీవల రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు దొంగ’ అని వ్యాఖ్యానించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. కాగా, దీనిపై రాహూల్ గాంధీ వెంటనే స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. రాహుల్ గాంధీ స్పందిస్తూ తాను రాజకీయ ప్రచారం వాడివేడిగా జరుగుతున్నపుడు అనుకోకుండా ఈ మాటలు మాట్లాడినట్లు సుప్రీంకోర్టుకు సోమవారం తెలిపారు.   ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రఫేల్‌ అవినీతిపై పోరాటంలో తమకు నైతిక విజయం లభించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దొంగతనం చేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: