తెలంగాణలో ఇంటర్‌ మంటలు చల్లారడం లేదు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  తప్పుడుతడకల ఫలితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు.


అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యవహించాలని డిమాండ్‌ చేస్తూ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డ్‌ వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. 


ఇంట్మీడియట్ బోర్డు వద్ద పోలీస్ ల ఓవర్ యాక్షన్.. న్యాయం అడిగేందుకు వచ్చిన అమ్మయిపట్ల దురుసు ప్రవర్తన.  ఒక్క అమ్మాయిపై పదుల మంది పోలీసుల దౌర్జన్యం. అధికారులతో మాట్లాడాలంటే బలవంతంగా అరెస్ట్.. అడ్డుకున్న ఇద్దరు సోదరులు, తల్లిని కూడా దారుణంగా ఈడ్చు కెళ్ళిన పోలీసులు
పోలీసుల తీరు పట్ల మండి పడుతున్న విద్యా ర్తులు, తల్లిదండ్రుల ఆగ్రహం వెలుబుచ్చుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: